• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YSRCP BIG FOLLOWER DIFFERENT CAMPAIGN FOR MPTC ZPTC CANDIDATES IN VIZIANAGARAM DISTRICT NGS

Andhra pradesh: జగన్ పై అభిమానంతో వింత ఐడియా.. బండికి ఫ్యాన్ రెక్కలు కట్టి ఊరూరా ప్రచారం

Andhra pradesh: జగన్ పై అభిమానంతో వింత ఐడియా.. బండికి ఫ్యాన్ రెక్కలు కట్టి ఊరూరా ప్రచారం

జగన్ వీరాభిమాని

దేశ వ్యాప్తంగా వైఎస్ జగన్ కు కోట్లలో అభిమానులు ఉండొచ్చు.. కానీ బొబ్బిలికి చెందిన రియాజ్ మాత్రం తాను జగన్ కు వీరాభిమానిని అంటున్నాడు. అందుకే ఎవరూ ఆదేశించకుండానే.. వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల విజయం కోసం వినూత్నంగా ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.

  • Share this:
    అభిమాన నాయకుడిని ఆరాధించడంలో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. తమకు ఇష్టమైన హీరో లేదా రాజకీయ నేత కోసం ఏదైనా చేయాలని తాపత్రయపడేవారు చాలామందే ఉంటారు. కొందరు ఇష్టమైన నేతల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు పెడతారు? తమ అభిమానుల పేరుతో మరికొందరు రక్త దానం లేదా పేదలకు నిత్యావసరాలు పంచుతూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే పాదయాత్ర చేసిన వాళ్లు ఉంటారు.. దేవుళ్లను మొక్కుకునేవారు ఉంటారు? మరికొందరైతే ఏకం గుళ్లే కట్టేస్తారు. ఇది ఎవరూ చేయమని చెప్పకపోయినా తమ అభిమానం అందిరకీ తెలిసేలా ఇలా చేస్తూ ఉంటారు..

    విజయనగరం జిల్లాలోని రియాజ్ ఖాన్ అనే వ్యక్తికి జగన్ అంటే అభిమానం.. అయితే అభిమానం ఎలాగైనా అందరికీ తెలిసేలా చేయాలి అనుకున్నాడు. అంతే ఓ వింత ఆలోచనకుం శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు అతడి వింత ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీడీపీ అధిష్టానం ఎన్నికలను బహిష్కరించినట్టు చెబుతున్నా.. అన్ని జిల్లాల్లో స్థానిక నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ పార్టీ బలపరిచిన అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

    అయితే రియాజ్ ఖాన్ పార్టీ లీడర్ కూడా కాదు.. కేవలం జగన్ అభిమాని మాత్రమే.. అందుకే తమ అధినేతపై అభిమానంతో వైసీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనపై వేసుకున్నాడు. అధికార పార్టీ తరపున జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలంటూ సొంతగా ప్రచారం మొదలెట్టాడు. అయితే అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. వైసీపీ గుర్తు అయిన ఫ్యానులను పట్టుకుని ప్రచారం చేస్తున్నాడు. తన బండి చుట్టూ వివిధ రకాల ఫ్యాన్ రెక్కలను అమర్చాడు. ప్రతి వీధి వీధి తిరుగుతూ తమ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నాడు. వివిధ రకాల ఫ్యాన్లు అన్నీ ఒకే బండిపై దర్శనం ఇస్తుండడంతో అంతా వాటిని ఆసక్తిగా చూస్తున్నారు.

    తన ప్రచారానికి ఆదరణ వస్తోందని గుర్తించాడు. దీంతో ఊరూరా తిరుగుతున్నాడు. బొబ్బిలి నియోజకవర్గం లోని బాడంగి, తెర్లాం, బొబ్బిలి, రామచంద్రపురం మండలాల్లోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. తమ పార్టీ సింబల్ పై ఓటేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించమని కోరుతున్నాడు రియాజ్ ఖాన్. ఎలాంటి స్వార్థం లేకుండా అధినేతపై అభిమానంతో ఇలా అతడు చేస్తున్న ప్రచారం అందర్నీ ఆకట్టుకుంటోంది.
    Published by:Nagesh Paina
    First published: