Home /News /politics /

YSRCP ANNOUNCED MLC CANDIDATES FOR LOCAL BODIES QUOTA FULL DETAILS HERE PRN GNT

AP MLC Elections: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల.. జిల్లాల వారీగా ఎంపికైన నేతలు వీళ్లే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) జాబితాను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు సజ్జల తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50శాతం సీట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ఎన్నికలు జరిగే 14 స్థానాల్లో ఏడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మరో ఏడు సీట్లు ఓసీలకు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 90శాతం సీట్లు దక్కించుకున్న అధికార పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో పార్టీ పరంగా, సామాజిక వర్గాల పరంగా సమీకరణాలను బేరీజు వేసుకోని అభ్యర్థులను ఎంపిక చేసింది.

    జిల్లాల వారీగా అభ్యర్థులు వీళ్లే..
    ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయనగరం జిల్లా నుంచి రఘురాజు, విశాఖపట్నం జిల్లా నుంచి వరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్, తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంత ఉదయ్ భాస్కర్, కృష్ణాజిల్లా నుంచి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మరుగుడు హన్మంతరావు, ప్రకాశం జిల్లా నుంచి తూమటి మాధవరావు, చిత్తూరు జిల్లా నుంచి భరత్, అనంతపురం జిల్లా నుంచి శివరామిరెడ్డిని ఎంపిక చేశారు.

    ఇది చదవండి: బీజేపీపై జగన్-కేసీఆర్ యుద్ధానికి కారణం ఇదేనా..? అసలు వ్యూహం వేరే ఉందా..? డైరెక్షన్ ఆయనదేనా..?


    పార్టీలోని సీనియర్ నేతలు, ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు చేసినట్లు సజ్జల తెలిపారు. మండలి పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ సామాజిక న్యాయం పాటించామన్నారాయన. ఇందులో భాగంగానే పాలవలస విక్రాంత్, ఇసాక్ బాషా, డీసీ గోవింద రెడ్డికి అవకాశమిచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఉన్న 18 స్థానాలకు ఈ 14 స్థానాలు కలిపితే మండలిలో వైసీపీ బలం 32కు చేరుకుటుందన్న సజ్జల... వీరిలోనూ 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే అవుతారని పేర్కొన్నారు.

    ఇది చదవండి: వాళ్లిద్దరి విషయంలో మాట నిలబెట్టుకున్న జగన్... మిగిలిన వారి ఆశ కూడా అదే..!


    ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మండలిలో వైసీపీ బలం 32కు చేరుకోనుంది. దీంతో మూడు రాజధానుల వంటి కీలక బిల్లుల ఆమోదానికి లైన్ క్లియర్ అవుతుందని అధికార పార్టీ భావిస్తోంది. మూడు రాజధానులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు బిల్లుల వంటివి ఆమోదం లభించే అవకాశముంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap mlc elections, AP Politics, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు