YSRCP ANNOUNCED MLA QUOTA MLC CANDIDATES IN ANDHRA PRADESH AK
Andhra Pradesh: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు.. వీరికి ఛాన్స్ ఇచ్చిన సీఎం జగన్
వైఎస్ జగన్ (ఫైల్)
Ysrcp Mlc: కడప జిల్లాకు చెందిన డీసీ గోవిందరెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన ఇషాక్ బాషా, శ్రీకాకుళం జిల్లాకుచెందిన పాలవలస విక్రాంత్‌ను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది వైసీపీ.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా పోటీ చేయబోయే ముగ్గురు అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన డీసీ గోవిందరెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన ఇషాక్ బాషా, శ్రీకాకుళం జిల్లాకుచెందిన పాలవలస విక్రాంత్‌ను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది వైసీపీ. ఏపీలోని అన్ని ఎన్నికల తరహాలోనే ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం ముమ్మర కసరత్తు చేసింది. మొత్తం 14 స్థానాలు ఖాళీలు ఉండగా, ఆశావాహుల సంఖ్య మాత్రం పెద్ద సంఖ్యలో ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సామాాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలోనే ముగ్గురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గోవిందరెడ్డి, ఇషాక్ భాషా, విక్రాంత్‌కు అవకాాశం కల్పించింది. జిల్లాల వారీగా నేతల వడబోతను చేపట్టిన అనంతరం.. వైసీపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయడంతో.. ఇక స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో వైసీపీ పూర్తి మెజార్టీ ఉండటంతో ఈ 14 స్థానాల్లోనూ విజయం నల్లేరుపై నడకే అని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. దాదాపు అన్ని కూడా ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అందుకే అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది వైసీపీ నాయకత్వం.
స్థానిక సంస్థల తరపున పోటీ చేసే విషయానికొస్తే.. గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్, కృష్ణా జిల్లాలో తలశిల రఘురాం, ప్రకాశం జిల్లా నుంచి రంగనాథబాబు, వైజాగ్ నుంచి వంశీ కృష్ణ యాదవ్, విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరి రఘురాజు, తూర్పుగోదావరి నుంచి అనంతబాబు, చిత్తూరు జిల్లా భరత్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మొత్తం 14 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం వరకు కేటాయించాలనే భావనలో సీఎం జగన్ ఉన్నట్టు వాార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ ఎంపిక ప్రక్రియ పూర్తికానుందని తెలుస్తోంది. ఆ వెంటనే అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముందని సమాచారం.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.