Home /News /politics /

YSRCP AND TDP CORPORATORS FIGHT FOR NTR AND YSR PHOTOS IN VIJAYAWADA CORPORATION COUNCIL HALL AK

విజయవాడ కార్పొరేషన్‌లో ఫోటోల రగడ... టీడీపీ వర్సెస్ వైసీపీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ కార్పొరేషన్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలను తొలగించడంపై వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వివాదం మొదలైంది.

    విజయవాడ కార్పొరేషన్‌లో ఫోటోల మార్పు కొత్త వివాదానికి తెరలేపింది. కార్పొరేషన్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలను తొలగించి సీఎం వైఎస్ జగన్ ఫోటోను ఏర్పాటు చేశారు కార్పొరేషన్ అధికారులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్పొరేషన్ మేయర్ శ్రీధర్... అసలు ఎవరిని అడిగి ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలు తీశారని అధికారులపై మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ ఫోటోను ఏర్పాటు చేయడంపై తనకు అభ్యంతరం లేదన్న మేయర్ శ్రీధర్... మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఫోటోను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

    ఎన్టీఆర్ ఫోటోను కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేయాలనే అంశంపై గతంలో తీర్మానం చేశామని మేయర్ శ్రీధర్ తెలిపారు. అయితే ఈ తీర్మానంలో దివంగత ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టొచ్చని ఉందన్న వైసీపీ కార్పొరేటర్లు... అలాగైతే మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఫోటోను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు మేయర్ అంగీకరించకపోవడంతో వైసీపీ కార్పొరేటర్లకు ఆందోళనకు దిగారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కౌన్సిల్ సమావేశం కొద్దిసేపు వాయిదా పడింది. నేడు విజయవాడ కార్పొరేషన్ చివరి సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ వివాదం చెలరేగడం గమనార్హం.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: NTR, Tdp, Vijayawada, YSR, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు