టీడీపీది ఓ రూల్, వైసీపీది మరో రూల్... ఇంతకీ ఏ నిబంధన కరెక్ట్?

రెండు పార్టీలు నిబంధనల పేరు చెప్పి తమ వాదనే కరెక్టని వాదిస్తున్నాయి. ఇంతకీ ఎవరి వాదన కరెక్టనే విషయం ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది.

news18-telugu
Updated: February 14, 2020, 6:47 PM IST
టీడీపీది ఓ రూల్, వైసీపీది మరో రూల్... ఇంతకీ ఏ నిబంధన కరెక్ట్?
చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ది, రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు పాస్ అయ్యాయా? లేదా? ఈ విషయంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వాదనను తెరపైకి తెస్తోంది. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ మరో వాదనను తెరపైకి తెస్తుంది. ఏ పార్టీ వారు ఆ పార్టీకి అనుకూలంగా, ఎదుటిపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో అసలు ఏ నిబంధన సరైంది? ఏది కాదు? అనే గందరగోళం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొంది.

వైసీపీ వాదన ఏంటి?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని - అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును ఆమోదించిన తర్వాత దాన్ని శాసనమండలికి పంపింది. అయితే, ఆ తర్వాత శాసనమండలిలో ఆ బిల్లుపై భారీ వివాదం చెలరేగింది. ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. దీనిపై వివాదం నెలకొంది. నిబంధనలకు అనుగుణంగా లేదంటూ ఆ సెలక్ట్ కమిటీ ఏర్పాటును శాసనమండలి సెక్రటరీ తిప్పి పంపినట్టు తెలిసింది. దీనిపై రెండు పార్టీల మధ్య వాదన ప్రతివాదనలు జరుగుతున్నాయి. సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదు కాబట్టి, నిబంధనల ప్రకారం 14 రోజులు దాటితే ఆ బిల్లులు ఆమోదం పొందినట్టుగానే పరిగణించాలని వైసీపీ చెబుతోంది.

టీడీపీ వాదన ఏంటి?
మరోవైపు వైసీపీ వాదనను టీడీపీ ఖండిస్తోంది. సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేస్తూ శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించారంటే, దాన్ని తిప్పి పంపే అధికారం కోర్టులకు కూడా ఉండదని, అధికారులకు ఎలా ఉంటుందని టీడీపీ ప్రశ్నిస్తోంది. శాసనమండలి కార్యదర్శి... చైర్మన్ చెప్పినట్టు చేయాల్సిందే కానీ, ఆయన నిర్ణయాలను తిప్పి పంపే అధికారం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల మీద ఆర్డినెన్స్ తెస్తుందనే ప్రచారం ఉంది. బిల్లులు పాస్ అయినట్టు ప్రభుత్వానికి స్పష్టత ఉంటే మళ్లీ ఆర్డినెన్స్ ఎందుకు తెస్తున్నారనే వాదన కూడా టీడీపీ నుంచి వినిపిస్తోంది.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు