YSR TELANGANA PARTY CHIEF YS SHARIMLA MADE INTERESTING COMMENTS ON RELATIONSHIP WITH HER BROTHER YS JAGAN MOHAN REDDY IN ABN INTERVIEW FULL DETAILS HERE PRN GNT
YS Jagan-Sharmila Relation: షర్మిల విషయంలో జగన్ అంత కఠినంగా వ్యవహరించారా..? అసలు నిజం ఇదేనా..?
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల
వైఎస్ షర్మల (YS Sharmila) వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) పేరుతో కొత్తపార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఐతే తెలంగాణ పాలిటిక్స్ లో షర్మిల ఎంట్రీ వైఎస్ కుటుంబంలో (YS Family) చిచ్చురేపిందన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది.
వైఎస్ కుటుంబానికి (YSR Family) తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics) ప్రత్యేక స్థానముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhr aPradesh) కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekha Reddy) ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే.. విభజన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS jagan Mohan Reddy) ఏపీకి సీఎంగా ఉన్నారు. ఆయన కుమార్తె వైఎస్ షర్మల (YS Sharmila) వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) పేరుతో కొత్తపార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఐతే తెలంగాణ పాలిటిక్స్ లో షర్మిల ఎంట్రీ వైఎస్ కుటుంబంలో చిచ్చురేపిందన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. అన్నమద అలిగి చెల్లెలు కొత్తపార్టీ పెట్టారన్న చర్చ కూడా జరిగింది. ఐతే తమ కుటుంబంలో ఏం జరిగిందనేదానిపై అటు షర్మిలగానీ.. ఇటు వైఎస్ జగన్ కానీ నోరువిప్పలేదు. తాజాగా వైఎస్ కుటుంబంలో విభేదాలు, ఇతర అంశాలపై వైఎస్ఆర్ కుమార్తె, వైటీపీ అధ్యక్షురాలు షర్మల నోరువిప్పారు.
ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు...
వైఎస్ కుటుంబంలో విభేధాలు తారాస్థాయికి చేరాయనడానికి ఆదివారం రాత్రి ఓ మీడియా ఛానల్ కి వై.ఎస్ షర్మిల ఇచ్చిన ఇంటర్వ్యూనే నిదర్శనం. ఇంటర్వ్యూలో ప్రశ్నలు-వాటికి షర్మిళ ఇచ్చిన సమాధానాలు పక్కన పెడితే తమ కుటుంబానికి ఓ సొంత మీడియా సంస్థ ఉండి కూడా.., చాలా అంశాల్లో తన తండ్రిని, సోదరుడ్ని వ్యతిరేకిస్తున్నారని, టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారన్న పేరున్న న్యూస్ ఛానల్లో షర్మిల ఇంటర్వ్యూ ఇవ్వడమే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో ABN ఛానల్ లో రాధాకృష్ణ చేసే ఇంటర్వ్యూలు కొంతలో కొంత ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఇంటర్వ్యూకి వచ్చిన వారి రాజకీయ, వ్యక్తిగత వివరాలపై కూలంకుషంగా చర్చ పెట్టడం సదరు కార్యక్రమం ప్రత్యేకత. సినీ ప్రముఖులు, సెలబ్రెటీలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలపైనా ఇందులో చర్చ జరుగుతుంది.
ఇలా చేస్తారనుకోలేదు: షర్మిల
ఐతే ఆదివారం ఏబీఎన్ లో వైటీపీ అధినేత షర్మిల ఇంటర్వ్యూ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఐతే ఈ ఇంటర్వ్యూలో ఆర్కే మరీ అంత లోతుగా వెళ్ళలేదనే చెప్పాలి. ఐతే ఓ ఆసక్తికర అంశం మాత్రం బయటకు వచ్చింది. ఆర్కే అడిగిన ప్రశ్నలలో ప్రధానంగా తన అన్న ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ కి గతంలో తాను శక్తికి మించి సాయపడ్డానని షర్మిల వెల్లడించారు. తన రాజకీయ ప్రణాళికలను జగన్ అండ్ కో చులకనగా చూశారని.. సాక్షి కో-ఓనర్ ఐన తనను అస్సలు పట్టించుకోవడంలేదని వాపోయారు.
ఇక తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది సీనియర్ రాజకీయనాయకులు హాజరు అయ్యారని, అన్న మాత్రం ఆహ్వానం పంపినా తనకు ముఖ్యమైన పనులు ఉన్నాయని చెప్పి రాలేదని.., ఇప్పుడు తన తండ్రిలేని లోటు తనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం షర్మిల చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. షర్మిల మాటలను బట్టి చూస్తే... ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90శాతం పైగా అమలు చేసి మాట నిలబెట్టుకున్నానని జగన్ అప్పుడప్పుడు చెప్తుంటారు. అలాంటిది ఇంటి ఆడపడుచు అయిన షర్మల విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించారా..? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.