YSR RAITHU BHAROSA SCHEME WILL BE IMPLEMENT FROM OCT FIFTEENTH MS
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా అమలు
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
AP YSR RYTHU Bharosa Scheme 2019 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు.
అక్టోబర్ 15వ తేదీ నుంచి రైతు భరోసా పథకం అమలు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40లక్షల మంది అర్హులైన రైతులను గుర్తించామన్నారు.ఒక్కో రైతుకు రూ.12500 చొప్పున పెట్టుబడి సాయం అందించినున్నట్టు చెప్పారు. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు. అక్టోబర్ 10న అన్ని గ్రామ సచివాలయ కేంద్రాల వద్ద రైతు భరోసా అర్హులు,అనర్హుల జాబితాను వెల్లడిస్తామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పెద్ద పీట వేయడం జరిగిందని, వీటిని సరిచేసేందుకు అర్హులైన రైతులు సహకరించాలని కోరారు.
భూమి కలిగి ఉన్న లక్షా 7వేల మంది రైతులు తమ వారసులను లబ్దిదారులుగా గుర్తించి.. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా అనర్హులను సరైన సమాచారం ద్వారా తొలగించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.