Jagananna Colony: ఏపీలో ఇళ్లు లేని పేదవాడు ఉండొద్దు.. కేసులకు భయపడేది లేదన్న ఏపీ సీఎం జగన్

జగనన్న కాలనీలకు శ్రీకారం

ఏపీలో పేదలకు తీపి కబురు చెప్పారు సీఎం జగన్.. 2022 నాటికి తొలి విడత జగనన్న కాలనీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభించారు.

 • Share this:
  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు సీఎం జగన్. ప్రస్తుతం కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించి తీరుతామన్నారు. మొదటి దశలో 28,084 కోట్ల రూపాయల వ్యయంతో 15 లక్షల 60 వేల 227 ఇళ్ల నిర్మాణాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదన్నారు. పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామన్నారు. పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

  కేసులకు భయపడం.. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం..
  ఏపీలో అందరికీ ఇళ్లు ఇవ్వాలని భావించినా.. ఆ పని చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఇళ్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తే కొందరు దుర్బుద్దితో కేసులు వేశారని మండిపడ్డారు.. అలాంటి కేసులకు భయపడమని.. న్యాయపరంగా వాటిని ఎదుర్కొని పేదలు అందిరికీ గృహ నివాసం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదన్నారు. పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామన్నారు. పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

  ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మొదటి దశలో గృహ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. వచ్చే ఏడాది జూన్‌ 22 కల్లా తొలి దశ గృహ నిర్మాణాల పనులు పూర్తి చేస్తామన్నారు. రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. రెండు దశలు కలిపి 50 వేల 940 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. PMAYతో అనుసంధానం చేసుకుని గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. 17 వేల వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు.

  17 వేల వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. 31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తి ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. విశాలమైన రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, అండర్‌గ్రౌండ్ విద్యుత్, తాగునీరు, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలతో జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. ఏపీలో ప్రతి పేదవాడికి 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల ఆస్తిని ఇస్తున్నామన్నారు. 360 చదరపు అడుగుల స్థలంలో నిర్మాణం చేపడుతున్నామన్నారు.

  ఎన్నికల సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన మేనిఫెస్టోలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ అనే హామీని 2023 జూన్‌ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతోపాటు భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తొలి దశలో 8905 వైఎస్సార్‌ జగనన్న కాలనీలు నిర్మిస్తుండగా.. రెండో దశలో 8,100 కాలనీలను నిర్మించనున్నారు. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32,909 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

  ఇదీ సంగతి: సెంచరీ నాటౌట్.. ఏపీని భయపెడుతున్న పెట్రోల్ డీజల్ ధరలు.. ఏ జిల్లాలో ఎంత?

  4,128 కోట్లతో తాగునీరు, రూ.22,587 కోట్లతో సిమెంట్‌ రోడ్లు, కాలనీ సైజును బట్టి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌.. రూ.4,986 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ సౌకర్యం, రూ.627 కోట్లతో ఇంటర్నెట్, ఇతర సౌకర్యాల కోసం రూ.567 కోట్లు వ్యయం చేస్తోంది. వైఎస్సార్‌ జగనన్న కాలనీలను అన్ని హంగులతో.. అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రతి ఇల్లు అన్ని సదుపాయాలతో కాలనీలు రూపు దిద్దుకోబోతున్నాయన్నారు సీఎం జగన్. ఒకేరకమైన నమూనాతో ప్రతి ఇంటిని 360 చదరపు అడుగులలో ఒక పడక గది, హాలు, వంట గది, స్నానాల గది, వరండాతో నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌ లైట్లు, నాలుగు బల్బులు, ఒక సింటెక్స్‌ ట్యాంకును అందిస్తున్నామన్నారు.

  ఇదీ సంగతి: ఆనందయ్య ముందు పంపిణీ ఎప్పుడంటే.. వెబ్ సైట్ ద్వారా ఇతర జిల్లాలకు మందు

  లబ్ధిదారుడికి మూడు ఆప్షన్లు
  గృహ నిర్మాణంలో లబ్ధిదారుడి నిర్ణయానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది అన్నారు. మంజూరు చేసిన ఇళ్లను నిర్దిష్ట నమూనాలో నిర్మించుకునే విషయంలో లబ్ధిదారుడు సొంతగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. మూడు ఆప్షన్లను లబ్ధిదారుల ముందు ఉంచామన్నారు.
  ఆప్షన్‌ 1 : ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేసి, లేబర్‌ చార్జీలకు కూడా డబ్బు ఇస్తుంది. లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకోవచ్చు.
  ఆప్షన్‌ 2 : ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులు తామే తెచ్చుకోవచ్చు. తమకు నచ్చిన చోట కొనుక్కొని ఇల్లు నిర్మించుకోవచ్చు. దశల వారీగా పని పురోగతిని బట్టి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో బిల్లుల చెల్లింపులను జమ చేస్తుంది.
  ఆప్షన్‌ 3 : తాము కట్టుకోలేమని చెప్పిన వారికి, ఆ బాధ్యత అంతా ప్రభుత్వమే తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. నిర్దేశించిన నమూన ప్రకారం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సరఫరా చేయడంతోపాటు పూర్తి సహయ సహకారాలు అందించి ప్రభుత్వమే కట్టిస్తుంది అని అన్నారు.
  Published by:Nagesh Paina
  First published: