Home /News /politics /

YSR CONGRESS PARTY TOOK KEY DECISION ON YS VIJAYAMMA MEETING IN HYDERABAD FULL DETAILS HERE PRN

YCP on Vijayamma Meeting: విజయమ్మ సభపై వైసీపీ కీలక నిర్ణయం.. అధిష్టానం ఆదేశం ఇదేనా..?

జగన్, షర్మిలతో విజయమ్మ (ఫైల్ ఫోటో)

జగన్, షర్మిలతో విజయమ్మ (ఫైల్ ఫోటో)

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics) వైఎస్ విజయమ్మ (YS Vijayamma Meeting) ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ వర్ధంతి (YSR Death Anniversary) సభపైనే చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వైసీపీ (YSRCP) నేతలు వెళ్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...
  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics) వైఎస్ విజయమ్మ (YS Vijayamma Meeting) ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ వర్ధంతి (YSR Death Anniversary) సభపైనే చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రావాలంటూ వైఎస్ఆర్ (YSR) హయాంలో పనిచేసిన మంత్రులు, ఆయనకు క్లోజ్ గా ఉన్న నేతలు, సినీరాజకీయ ప్రముఖులను ఆమె ఆహ్వానించారు. ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులున్నారు. పార్టీలకు అతీతంగా ప్రముఖులకు విజయమ్మ ఆహ్వానాలు పంపారు. కొందరికి స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. వీరిలో ప్రధానంగా ప్రస్తుత ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. విజయమ్మ నుంచి ఆహ్వానం అందినా వైసీపీ నేతలు వెళ్తారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది.

  ఈ సమావేశానికి హాజరవడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్  (AP CM YS Jagan Mohan Reddy)నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి సూచన అందినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్లకపోవడమే మంచిదనే భావన వ్యక్తమైనట్లు వార్తలు వస్తున్నాయి.

  ఇది చదవండి: ఏపీకి అలర్ట్... సెప్టెంబర్ నెలంతా వానలే.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో..


  ఇట టీఆర్ఎస్ లో ఉన్న నేతలకు కూడా ఆహ్వానం అందింది. ఐతే ప్రస్తుతం ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఉన్నందున వారు వచ్చే అవకాశాలు తక్కువే. ఎటొచ్చి వైఎస్ఆర్ స్నేహితుడు, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నేతలు వచ్చే అవకాశముంది. ఈ సభను వైసీఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు సమన్వయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

  ఇది చదవండి: బస్ టికెట్ల బుకింగ్ కు కొత్త యాప్... అభి బస్ తో ఏపీఎస్ ఆర్టీసీ బిగ్ డీల్...


  ఈ వైఎస్‌ఆర్ సంస్మరణ సభకు రావాలని వైఎస్‌ విజయలక్ష్మి సుమారు 300 మందికి ఆహ్వానం పంపారు. సభలో 30 మంది ప్రసంగిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. సంస్మ‌ర‌ణ స‌భ‌కు రాజ‌కీయ‌నేత‌ల‌తో పాటూ అన్ని రంగాల ప్ర‌ముఖుల‌కు విజయలక్ష్మి ఆహ్వానం పంపారని తెలుస్తోంది.  ప్ర‌జాక‌వి గ‌ద్ద‌ర్‌(Gaddar)ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించినట్టు సమాచారం. సినిమా రంగం నుంచి ప్ర‌ముఖ న‌టులు చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), సూప‌ర్‌ స్టార్ కృష్ణ (super star Krishna), నిర్మాత దిల్ రాజు (dil Raju)ల‌కు ఆహ్వానం పంపారు. అలాగే రిటైర్జ్ జడ్జి సుదర్శన్‌రెడ్డి కూడా సభకు వస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి మంత్రి స‌బిత‌ ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), ఎంపీ డి. శ్రీనివాస్ (d srinivas, మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్సన్ సునితా ల‌క్ష్మారెడ్డి (sunitha laxma Reddy), ఎమ్మెల్యే దానం (Danam Nagender) నాగేంద‌ర్‌ల‌ను ఆహ్వానించారు.

  ఇది చదవండి: వర్షపు నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలున్నాయా..? దీర్ఘాయుష్షు సొంతమా..?


  ఇక కాంగ్రెస్ నుంచి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ (Komatireddy Brothers), జానారెడ్డి (Jana Reddy), దామోద‌ర రాజ‌న‌రసింహ (dhamodhar Rajanarsimha), గీతారెడ్డి (Geetha Reddy), దుద్దిళ్ల శ్రీద‌ర్ బాబు (D sridhar babu) ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్(MP Jithendhar), డీకే అరుణ‌ (DK Aruna)ల‌కు ఆహ్వానం పంపారు.

  ఇది చదవండి: శ్రీవారి భక్తులకు సరికొత్త ప్రసాదం.. టీటీడీ కీలక నిర్ణయం


  ఇదిలా ఉంటే గురువారం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ దంపతులతో పాటు ఆయన సోదరి షర్మలి, తల్లి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్, షర్మిల కనీసం పలకరించుకోకపోవడం చర్చనీయాంశమైంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, YS Vijayamma, Ysrcp, Ysrtp

  తదుపరి వార్తలు