కర్నూలు జిల్లా ఎస్సీని కలిశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. మల్లెపల్లి నాటుబాంబుల వ్యవహారంలో అనంతరెడ్డిని అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. దీనిపై ఆయన సతీమణి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మల్లెపల్లిలో రెండుసార్లు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరెడ్డికి శతృవులు ఎవరు లేరన్నారు. వైసీపీలో కీలకంగా పనిచేస్తున్నందకే టీడీపీ నేతలు కుట్రపూరితంగా ఆయనను ఇరికించారని ఆరోపించారు. టిడిపి పత్తికొండ నియజకవర్గంలో హత్యా రాజకీయాలు చేస్తుందన్నారు రాజేశ్వరి.
ఎస్పీని కలిసిన వారిలో కంగాటి శ్రీదేవి, పత్తికొండ వైసిపి ఇన్ఛార్జ్ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల్ని, కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేయడానికి టిడిపి పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తుందని ఆరోపించారు. కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు, కుట్ర పూరితంగా అక్రమ కేసులు పెట్టి విపక్ష పార్టీ నేతలను భయపెట్టాలని చూడటం సరైంది కాదన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం బాధాకరమన్నారు.వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపి ఓర్వలేకపోతుందన్నారు. ప్రభుత్వ ప్రోద్బలంతోనే పోలీసులు కేసులు పెడుతున్నారని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.