చంద్రగిరి రీపోలింగ్‌పై... ఈసీని కలిపిన వైసీపీ నేతలు

ఈసీని కలిసిన వారిలో వైసీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. చంద్రగిరిలో చంద్రబాబు ఎందుకు రీపోలింగ్ అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

news18-telugu
Updated: May 18, 2019, 12:16 PM IST
చంద్రగిరి రీపోలింగ్‌పై... ఈసీని కలిపిన వైసీపీ నేతలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 18, 2019, 12:16 PM IST
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘం చుట్టూ తిరుగుతున్నాయి. ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. కౌంటింగ్, రీపోలింగ్‌లో భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చూడాలని కోరారు.  ఈసీని కలిసిన వారిలో వైసీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. చంద్రగిరిలో చంద్రబాబు ఎందుకు రీపోలింగ్ అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనేక మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదన్నారు. ఏయే పోలింగ్ బూత్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేదన్న సమాచారాన్ని కూడా ఈసీకి అందించారు. దీంతో పాటు పలు డాక్యుమెంట్లను, ఓటర్ల లిస్ట్‌ను కూడా ఈసీకి సమర్పించినట్లు తెలుస్తోంది. తాజాగా శుక్రవారం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి చంద్రగిరి రీపోలింగ్‌పై ఫిర్యాదు చేశారు. ఎందుకు అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు.

First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...