• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YSR CONGRESS PARTY CANDIDATES WON MAJORITY WARDS UNANIMOUSLY IN ANDHRA PRADESH MUNICIPAL ELECTIONS FULL DETAILS HERE PRN

AP Municipal Elections: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ... వైసీపీ స్కోర్ ఇదే...

AP Municipal Elections: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ... వైసీపీ స్కోర్ ఇదే...

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలు వైసీపీ (YSR Congress) వశమయ్యాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈనెల 10న ఎన్నికలు జరగనున్న 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మొత్తం 17, 418 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వారిలో 2,900 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రధాన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈనెల 10న పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్ అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఏకగ్రీవాల విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపాలిటీల్లోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవాలు చేసుకుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఏకగ్రీవాల సంఖ్య ఎక్కువగా ఉంది.

    చిత్తూరు జిల్లాలోని పలమనేరు, పుంగనూరు మున్సిపాలిటీలు వైసీపీ కైవసం చేసుకుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు మున్సిపాలిటీలోని 31 వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. పలమనేరులో 26 వార్డులకు గానూ 18 వార్డులు వైసీపీ సొంతమవడంతో ఛైర్మన్ పీఠం కూడా కైవసం చేసుకుంది. నగిరి మున్సిపాలీటిల్లో 7 వార్డులు వైసీపీ అభ్యర్థులకు ఏకగ్రీవమయ్యాయి. మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 16 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్‌ లోని 50 డివిజన్లకు గానూ 19 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.

    ఇది చదవండి: అన్నగారు తమ్ముళ్లను గట్టెక్కిస్తారా..? ఆ హామీ ఓట్లు కురిపిస్తుందా..?



    ఇక సీఎం జగన్ సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో వైసీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల మున్సిపాలిటీలో 33 వార్డులు వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా.. రాయచోటిలో 34 వార్డులకు గానూ 31, ఎర్రగుంట్లలో 20 వార్డులకు గానూ 12, బద్వేలు మున్సిపాలిటీలో 35 వార్డులకు గానూ 10, ప్రొద్దటూరులో 41 వార్డులకు గానూ 9 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప మున్సిపల్ కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 23 స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    ఇది చదవండి: జనసేన-బీజేపీ తరపున ప్రచారం చేస్తా... చింతమనేని సంచలన వ్యాఖ్యలు



    కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. పట్టణంలోని 24 వార్డులకు గాను 15 వార్డులను వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకున్నారు. డోన్ మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో వైసీపీ 18వార్డులు సొంతం చేసుకోగా.. సీపీఐ ఒక వార్డును ఏకగ్రీవం చేసుకుంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలోని తుని మున్సిపాలిటీ వైసీపీ సొంతమైంది. పట్టణంలోని 30 వార్డులకు గానూ 15 మంది వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ 33 వార్డులకు 33 వార్డులు వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు