Tirupati By-poll: తిరుపతి అభ్యర్థిపై వైసీపీ అధికార ప్రకటన.. జగన్ చెప్పిన వ్యక్తికే టికెట్..

ఫ్రతీకాత్మక చిత్రం

Tirupati YCP Candidate: వైసీపీ ప్రకటించడానికి ముందే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..(Peddireddy RamachandraReddy) గురుమూర్తి (YCP Candidate Gurumurthy) పేరును వెల్లడించారు. సీఎం జగన్ (AP CM YS Jagan) ఒక్కసారి చెప్తే దానికి తిరుగుండదన్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్.. తమ అభ్యర్థిని ప్రకటించింది. ముందుగా అనుకున్నట్లుగానే వైసీపీ అభ్యర్థిగా డాక్టర్.ఎం.గురుమూర్తి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. వైసీపీ ప్రకటించడానికి ముందే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. గురుమూర్తి పేరును వెల్లడించారు. సీఎం జగన్ ఒక్కసారి చెప్తే దానికి తిరుగుండదన్నారు. గురుమూర్తి విషయానికి వస్తే..జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకు ఫిజియోథెరపిస్టుగా గురుమూర్తి పనిచేశారు. సౌమ్యుడిగా పేరుపొందిన ఆయనకు.. సాధారణ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయారు. బల్లి దుర్గాప్రసాద్ అకాలమరణంతో ఖాళీ అయిన తిరుపతి స్థానంలో గురుమూర్తికి అవకాశం కల్పించారు. ఉపఎన్నికలో గురుమూర్తిని గెలిపించి పార్లమెంటుకు పంపాలను సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

    ఇక 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరఫున బల్లి దుర్గా ప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు. కానీ, ఈ ఏడాది సెప్టెంబర్‌లో కరోనా వైరస్ బారిన పడ్డారు. చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో చనిపోయారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన బల్లి దుర్గా ప్రసాద్ 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. 1985, 1994, 1999, 2009లో నాలుగుసార్లు గూడూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. తిరుపతి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి మీద 2.28 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

    Chief Election Commissioner of India, Tirupati Lok Sabha By-polls, CEC Sunil Arora, Andhra Pradesh, AP news, Tirupathi News, AP News, Telugu news, కేంద్ర ఎన్నికల సంఘం, తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక, తిరుపతి ఉపఎన్నిక, తిరుపతి న్యూస్, ఏపీ న్యూస్, తెలుగు న్యూస్, YSR Congress, YSRCP, TDP, Telugu Desham Party, Janasena, Janasena Party, BJP, Bharatiya Janatha Party, వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, జనసేన పార్టీ, భారతీయ జనతాపార్టీ, బీజేపీ, Tirupati YCP Candidate Gurumurthy, YCP Confirms Gurumurthy, తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి,
    తిరుపతి వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి

    ఇది చదవండి: తిరుపతిలో ఏ పార్టీ బలమెంత.., వైసీపీ హవాను ప్రతిపక్షాలు అడ్డుకోగలవా..?



    ఇక టీడీపీ విషయానికి వస్తే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించారు. 2019లో కూడా టీడీపీ తరపున పనబాక పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఐతే అందరికంటే ముందే అభ్యర్థిగా ప్రకటించినా ఆమె మాత్రం ఇంతవరకు రంగంలోకి దిగలేదు. మరోవైపు జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులును నిలబెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే బీజేపీలో చేరిన ఆయన పేరును త్వరలోనే ప్రకటించే అవకాశముంది.
    Published by:Purna Chandra
    First published: