• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YSR CLOSE AIDE SUREEDU MEETS REVANTH REDDY AT RAVIRALA MEETING SU

Revanth Reddy: రేవంత్ సభలో ఆసక్తికర ఘటన.. వేదికపై ప్రత్యక్షమైన వైఎస్సార్ సన్నిహితుడు సూరీడు

Revanth Reddy: రేవంత్ సభలో ఆసక్తికర ఘటన.. వేదికపై ప్రత్యక్షమైన వైఎస్సార్ సన్నిహితుడు సూరీడు

Image-Twitter

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి  రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

  • Share this:
    కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి  రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని వ్యక్తి ఒకరు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సభకు హాజరుకావడం హాట్ టాఫిక్‌గా మారింది. ఆ వ్యక్తి ఎవరంటే.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూరీడు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూరీడు ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగారు. ఆయన ఎక్కడికి వెళ్లినా సూరీడు ఉండాల్సిందే. అయితే వైఎస్సార్ మరణానంతరం సూరీడు.. ఆ కుటుంబానికి దూరం అయ్యాడని వార్తలు వచ్చాడు. అయితే 2016లో ఓ సారి అప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును సూరీడు కలిశారు. ఇక, ఆ తర్వాత మీడియాలో కూడా సూరీడు పేరు పెద్దగా వినిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న సభలో ప్రత్యక్షం అవ్వడం రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.

    మరోవైపు తెలంగాణలో వైఎస్సార్ కుమార్తె షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ షర్మిల వెనుకున్నది ఎవరనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. వైఎస్ షర్మిల వెనుక వైఎస్ఆర్ ప్రధాన అనుచరులు, సన్నిహితులు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
    ఈ నేపథ్యంలో సూరీడు ఒక్కసారిగా కాంగ్రెస్ సభ వేదిక మీద ప్రత్యక్షం కావడంతో దీని వెనక కారణమేమిటనేది మరింత చర్చనీయాంశంగా మారింది.

    ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా రైతు రణభేరి పేరుతో యాత్రలు చేస్తున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగ్గింపు సందర్భంగా హైదరాబాద్ శివారులోని రావిరాలలో రైతు రణభేరి సభను ఏర్పాటు చేశారు. ఈ సభ మీద కూడా కాంగ్రెస్ పార్టీలో అతర్గతంగా అసమ్మతి వ్యక్తం అయింది. ఇక, రేవంత్ సభకు కాంగ్రెస్ నాయకులు బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, చిన్నారెడ్డి, కొండా సురేఖ, సీతక్క, మల్‌రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, విజయ రమణా రావు, దాసోజు శ్రావణ్.. తదితరులు హాజరయ్యారు
    Published by:Sumanth Kanukula
    First published: