Home /News /politics /

YSCRP SUPPORTERS WON MAJORITY NUMBER OF PANCHAYATS IN PHASE II PANCHAYAT ELECTIONS IN ANDHRA PRADESH

AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. తొలి ఫలితాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) రెండో విడత పోలింగ్ కు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. తొలివిడత మాదిరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YST Congress party) హవా కొనసాగుతోంది.

    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ కు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కౌంటింగ్ పూర్తై ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు వైసీపీ బలపరిచిన 522 మంది సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించగా టీడీపీ బలపర్చిన 21 మంది గెలిచారు. తొలి విడతలో మాదిరిగానే అన్ని జిల్లాల్లో

    శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 41 చోట్ల విజయం సాధించగా.. టీడీపీ ఇంతవరకు ఖాతా తెరలేదు. విజయనగరం జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 64, టీడీపీ మద్దతు దారులు రెండు చోట్ల విజయం సాధించగా.. ఇతరులు మూడు పంచాయతీలను కైవసం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో వైసీపీ 22 చోట్ల, తూర్పు గోదావరి జిల్లాలో 16 పంచాయతీలను సొంతం చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో అధికార పార్టీకి 15 పంచాయతీలు దక్కాయి.

    ఇది చదవండి: రికార్డ్ బ్రేక్ చేసిన పల్లె ఓటర్లు.. రెండో విడతలో ఆ జిల్లానే టాప్


    కృష్ణాజిల్లాలో 39 గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులు, నాలుగు చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందగా.. ఒక పంచాయతీ ఇతరులకు దక్కింది. గుంటూరు జిల్లాలో 76 పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు, ఏడు గ్రామాలు టీడీపీ మద్దతుదారుల ఖాతాలో వెళ్లాయి. ప్రకాశం జిల్లాలో 98 గ్రామాలు వైసీపీ మద్దతుదారులు, నాలుగు పంచాయతీలు టీడీపీ మద్దతుదారుల చేతుల్లోకి వెళ్లాయి. నెల్లూరు జిల్లాలో 47 గ్రామాలు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, రెండు పంచాయతీలు టీడీపీ మద్దతుదారులకు దక్కాయి.

    ఇది చదవండి: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. నిధుల విడుదలకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్



    చిత్తూరు జిల్లాలో 75 గ్రామాలు వైసీపీ మద్దతుదారులు గెలుచుకోగా.. టీడీపీ సానుభూతిపరులు ఖాతా తెరవలేదు. ఇతరులు ఒకస్థానంలో గెలిచారు. అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 22 చోట్ల., టీడీపీ మద్దతు దారులు ఒక చోట గెలిచారు. కర్నూలు వైసీపీ మద్దతుదారులు 51 గ్రామాల్లో గెలిస్తే.. టీడీపీ మద్దతుదారులు 6 గ్రామాలను సొంతం చేసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో వైసీపీ మద్దతుదారులు 37 గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు 3 గ్రామాల్లో గెలిచారు.

    ఇది చదవండి: పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ లో టెన్షన్ టెన్షన్..



    ఇక రెండో విడత పోలింగ్ లో ఓటర్లు భారీగా పాల్గొన్నారు. తొలివిడత మాదిరిగానే రెండో విడతలోనూ 80శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 81.61శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొదటి విడతలో 81.09 శాతం పోలింగ్ నమోదవగా.. ఈసారి 0.52శాతం అధికంగా 81.61 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విడతలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 86.60 శాతం ఓటింగ్ రికార్డవగా.. శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 72.87 శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Bjp-janasena, Gram Panchayat Elections, Janasena, Local body elections, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు