Home /News /politics /

YSCRP MLA RK ROJA SLAMS NIMMAGADDA RAMESH KUMAR AND NARA CHANDRA BABU NAIDU OVER PANCHAYAT ELECTIONS PRN

MLA Roja: ఆయన అలా అనడం బాధేసింది.., ఆ విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారన్న రోజా

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో స్థానిక సంస్థల ఎన్నికలపై (Local Body Election) రగడ కొనసాగుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh kumar) పై వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోజా (MLA Roja).., ఎస్ఆసీపై అగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై రగడ కొనసాగుతోంది. సుప్రీం కోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండాగానే.., ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికషన్ రిలీజ్ చేయడంపై అధికార వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఎవరి ఒత్తిడితో నిమ్మగడ్డ అలా దిగజారి ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకున్నారన్నారు. ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకొని వారికి రెసిస్టెంట్ పవర్ వచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఓవైపు కరోనా వ్యాప్తి.., మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని ఆమె అన్నారు. స్థానిక ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు ఎలా చెబితే అలా చేస్తామని స్పష్టం చేశారు.

    భయంలేని వ్యక్తి జగన్
    ఇక ఎన్నికలంటే భయం లేని వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆమె అన్నారు. స్థానిక ఎన్నికలంటే జగన్ భయపడుతున్నారన్న వార్తలు ఆమె కొట్టిపారేశారు. సీఎంకు దమ్ములేదని టీడీపీ నేతలు ప్రచారం చేయడం హాస్యాస్పదమన్న ఆమె.., 2018లో జరగాల్సిన ఎన్నికలను చంద్రబాబే పిరికిపందలా భయపడి పారిపోయాడని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో సీఎం జగన్ ఎదుర్కొన్నన్ని ఎన్నికలు ఎవరూ ఎదుర్కొలేదని రోజా గుర్తు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనుకుండి ఎవరు నడిపిస్తున్నారో ఈ రాష్ట్రంలో చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారని ఆమె అన్నారు.

    అలా అనడం బాధేసింది
    ఇక ప్రివిలేజ్ కమిటీలో అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం నిజమేనని ఆర్కే రోజా స్పష్టం చేశారు. ప్రతి అంశం ఎమ్మెల్యేకు చెప్పాల్సిన అవసరం లేదని కలెక్టర్ అనడడం బాధేసిందన్నారామె. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు తనకు ఆహ్వానం అందడం లేదని తెలిపారు. పార్టీ పరంగా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.., అందరితోనూ సత్సంబంధాలున్నాయని స్పష్టం చేశారు.

    మరోవైపు స్థానిక ఎన్నికలపై స్టే విధించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సోమవారం (జనవరి 25) విచారణకు రానుంది. తొలుత ఈ పిటిషన్ ను జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుందని సుప్రీం కోర్ట్ రిజిస్ట్రీ తెలపగా.., తాజాగా బెంచ్ మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేష్ రాయ్ బెంచ్ విచారించుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా.., సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Chandrababu naidu, Gram Panchayat Elections, MLA Roja, Nimmagadda Ramesh Kumar, Roja Selvamani, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు