వైఎస్ వివేకా హత్యకేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించండి..ఈసీకి సునీత విజ్ఞప్తి

హత్యకేసును రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. విచారణ పాదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు.

news18-telugu
Updated: March 22, 2019, 2:45 PM IST
వైఎస్ వివేకా హత్యకేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించండి..ఈసీకి సునీత విజ్ఞప్తి
సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి (File)
news18-telugu
Updated: March 22, 2019, 2:45 PM IST
ఏపీలో ఎన్నికల రాజకీయాలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య చుట్టే తిరుగుతున్నాయి. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై మరొకరు హత్యారోపణలు చేసుకుంటున్నారు నేతలు. సాక్షాత్తు చంద్రబాబునాయుడే వైఎస్ ఫ్యామిలీపై ఆరోపణలను చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. తన తండ్రి హత్యకేసును రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. విచారణ పాదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు.

గురువారం రాష్ట్ర ఎన్నికల అధికారి జీకే ద్వివేదిని కూడా సునీతా కలిశారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. హత్య కేసును నిస్పక్షపాతంగా విచారించి అసలు దోషులకు శిక్షపడేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులపై టీడీపీ నేతలు మాట్లాడిన న్యూస్ పేపర్ క్లిప్సింగ్స్‌ని రాష్ట్ర ఎన్నికల అధికారికి సమర్పించారు. త్వరలో కేంద్రహోంశాఖకు కూడా ఫిర్యాదు చేయనున్నారు సునీత.


First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...