సీబీఐ విచారణ జరిపించండి.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదు : వైఎస్ వివేకా హత్యపై హైకోర్టుకు సౌభాగ్యమ్మ

YS Vivekananda Reddy Murder : వైఎస్ వివేకా హత్యపై సీబీఐ విచారణకు ఆయన కుటుంబం గట్టిగా పట్టుబడుతోంది. మరోవైపు ఏపీ పోలీసులు మాత్రం విచారణ సరిగానే జరుగుతోందని.. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడుతామని చెబుతున్నారు.

news18-telugu
Updated: March 29, 2019, 6:17 PM IST
సీబీఐ విచారణ జరిపించండి.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదు : వైఎస్ వివేకా హత్యపై హైకోర్టుకు సౌభాగ్యమ్మ
వైఎస్ వివేకానంద రెడ్డి (File)
  • Share this:
మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై ఆయన కుటుంబ సభ్యుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ సహా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతా రెడ్డి కేసు విచారణ జరుగుతున్న తీరుపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టును ఆశ్రయించిన వివేకా సతీమణి సౌభాగ్యమ్మ.. కేసును విచారిస్తున్న ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని.. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరుతూ ఇప్పటికే రెండు పిటిషన్లు దాఖలవగా.. తాజాగా సౌభాగ్యమ్మ కూడా పిటిషన్ ఫైల్ చేయడం గమనార్హం.

వివేకా హత్యపై సీబీఐ విచారణ కోరుతూ జగన్ కూడా హైకోర్టులో ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ కూడా సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. వివేకా కుమార్తె సునీతా రెడ్డి కూడా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. కేసును విచారిస్తున్న సీఐపై తమకు అనుమానాలున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

మొత్తం మీద వైఎస్ వివేకా హత్యపై సీబీఐ విచారణకు ఆయన కుటుంబం గట్టిగా పట్టుబడుతోంది. మరోవైపు ఏపీ పోలీసులు మాత్రం విచారణ సరిగానే జరుగుతోందని.. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడుతామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసులో చివరికి ఏం తేలుతుందనేది ఉత్కంఠను రేపుతోంది.

ఇది కూడా చదవండి : సీఐ ఎందుకిలా చేస్తున్నాడు.. నాన్న హత్య కేసు విచారణపై అనుమానాలున్నాయి : వైఎస్ వివేకా కుమార్తె

First published: March 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>