సీఐ ఎందుకిలా చేస్తున్నాడు.. నాన్న హత్య కేసు విచారణపై అనుమానాలున్నాయి : వైఎస్ వివేకా కుమార్తె

కేసు విచారణ ఎటువైపు వెళ్తుందో తనకు నిజంగా అర్థం కావడం లేదన్నారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి. విచారణ సరిగా చేయకుండా కుటుంబ సభ్యులనే నిందించడం సరికాదన్నారు.

news18-telugu
Updated: March 29, 2019, 6:43 PM IST
సీఐ ఎందుకిలా చేస్తున్నాడు.. నాన్న హత్య కేసు విచారణపై అనుమానాలున్నాయి : వైఎస్ వివేకా కుమార్తె
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి
news18-telugu
Updated: March 29, 2019, 6:43 PM IST
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన కుమార్తె సునీతా రెడ్డి అన్నారు. హత్య జరిగి ఇన్ని రోజులవుతున్నా.. ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న సీఐ.. హత్య కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పంచనామా జరగకముందే మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి ఎలా కట్లు కట్టిస్తారని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే ఇందులో ఆయన కూడా భాగస్వాములా..? లేక కేసును తప్పుదోవ పట్టించడానికి ఎవరైనా ఒత్తిడి తెస్తున్నారా..? అని అనుమానం వ్యక్తం చేశారు.

కేసు విచారణ ఎటువైపు వెళ్తుందో తనకు నిజంగా అర్థం కావడం లేదన్నారు. విచారణ సరిగా చేయకుండా కుటుంబ సభ్యులనే నిందించడం సరికాదన్నారు.కాగా, వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై అనుమానాలున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు సునీతా రెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేని విచారణ సంస్థతో హత్య కేసు దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

First published: March 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...