వైఎస్ వివేకా హత్య కేసు: చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు చేసిన సునీత

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులపై టీడీపీ నేతలు మాట్లాడిన న్యూస్ పేపర్ క్లిప్సింగ్స్‌ని రాష్ట్ర ఎన్నికల అధికారికి సమర్పించారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేస్తామని సునీత స్పష్టంచేశారు.

news18-telugu
Updated: March 21, 2019, 5:50 PM IST
వైఎస్ వివేకా హత్య కేసు: చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు చేసిన సునీత
సునీతా, వివేకానంద రెడ్డి (Image : Twitter)
news18-telugu
Updated: March 21, 2019, 5:50 PM IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై దుమారం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇదే అంశాన్ని హైలైైట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులే వివేకానందను హత్యచేశారని..ఆ నేరాన్ని తమపై మోపేందుకు జగన్ కుట్రచేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారి జీకే ద్వివేదిని కలిసిన సునీత..సాక్షాత్తు ముఖ్యమంత్రే కేసు దర్యాప్తును పక్కదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ద్వివేదికి చెప్పారు సునీత. హత్య కేసును నిస్పక్షపాతంగా విచారించి అసలు దోషులకు శిక్షపడేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె కోరారు. ఈ మేరకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులపై టీడీపీ నేతలు మాట్లాడిన న్యూస్ పేపర్ క్లిప్సింగ్స్‌ని రాష్ట్ర ఎన్నికల అధికారికి సమర్పించారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేస్తామని సునీత స్పష్టంచేశారు.

కాగా, విజయనగరం జిల్లా సాలూరు రోడ్‌షో వైఎస్ జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ‘బాబాయ్‌ని ఇంత దారుణంగా చంపేసి, ఎవరో చంపేసినట్టు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే మీకు రక్షణ ఉంటుందా? ఆడబిడ్డలు బయటకు వస్తే ఇంటికి రాగలరా? వీధికి ఒక రౌడీ తయారవుతాడు.’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి:‘బాబాయ్‌ని చంపేసి నాటకాలా?’.. వైఎస్ జగన్‌ ‘చీఫ్ క్రిమినల్‌‌’ వ్యాఖ్యలకు చంద్రబాబు

వాళ్లంతా కలిసి వైఎస్ వివేకానందరెడ్డిని చంపేశారా? ఫ్యాక్షన్ పగలే కారణమా?

Video: 'కటింగ్..కటింగ్'..ఓటర్‌కు హెయిర్ కట్ చేసిన లోకేశ్
Loading...
First published: March 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...