హోమ్ /వార్తలు /National రాజకీయం /

‘డ్రైవర్ చచ్చేట్టు కొట్టినాడు.. ప్రసాదును వదిలిపెట్టొద్దు.. ఇట్లు వైఎస్ వివేకానందరెడ్డి’

‘డ్రైవర్ చచ్చేట్టు కొట్టినాడు.. ప్రసాదును వదిలిపెట్టొద్దు.. ఇట్లు వైఎస్ వివేకానందరెడ్డి’

 ‘నా డ్రైవర్‌ను నేను తొందరగా డ్యూటీకి రమ్మన్నాను అని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేదాడనికి చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాదును వదిలిపెట్టద్దు.. ఇట్లు వైఎస్ వివేకానందరెడ్డి’ అని రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది.

  వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఇంట్లో గొడ్డలితో నరికి చంపారని ఆరోపించారు. ఈ కేసులో డ్రైవర్‌ను ఇరికించేందుకు కొందరు కుట్ర చేశారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా రాసిన లేఖ తమకు దొరికిందని, అందులో డ్రైవర్ పేరును ప్రస్తావించినట్టు పోలీసులు తనకు తెలిపారని వైఎస్ జగన్ అన్నారు. అయితే, హత్య చేస్తుంటే లేఖ ఎలా రాయగలరని జగన్ ప్రశ్నించారు. ఇదేదో కట్టుకథలా ఉందని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విచారణ తీరు మీద కూడా జగన్ కొన్ని సందేహాలను లేవనెత్తారు. తాను కడప ఎస్పీ రాహుల్ దేవ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఏడీజీ పదే పదే ఆయనకు ఫోన్ చేశారని జగన్ అన్నారు. అన్ని సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముందని జగన్ ప్రశ్నించారు. ‘నా డ్రైవర్‌ను నేను తొందరగా డ్యూటీకి రమ్మన్నాను అని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాదును వదిలిపెట్టద్దు.. ఇట్లు వైఎస్ వివేకానందరెడ్డి’ అని రాసిన లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది.

  వైఎస్ వివేకా రాసినట్టుగా చెబుతున్న లేఖ

  అయితే, అసలు వైఎస్ వివేకా ఆ లేఖ రాశారా?  లేకపోతే ఎవరైనా రాసి అక్కడ పెట్టారా? అదే నిజమైతే లేఖ రాసింది ఎవరు? డ్రైవర్ పేరును ఎందుకు రాశారు? అని పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీటితోపాటు పలు సందేహాలు కూడా సాధారణ ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. రక్తపు మడుగులో వివేకా పడిపోయి ఉంటే, గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారనే ప్రశ్న ఈ కేసును ఫాలో అవుతున్న వారికి అంతుబట్టకుండా ఉంది.

  వైఎస్ జగన్ ప్రెస్ మీట్:

  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Chandrababu Naidu, Kadapa, Nara Lokesh, TDP, Ys jagan, YS Vivekananda reddy

  ఉత్తమ కథలు