వైఎస్ వివేకా హత్యకేసులో టీడీపీ నేతకు సిట్ నోటీసులు

సొంత బాబాయ్ హత్యకేసును జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదని.. కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. అసలు నిందితులను దాచిపెట్టి.. డమ్మీలను తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: October 15, 2019, 10:11 PM IST
వైఎస్ వివేకా హత్యకేసులో టీడీపీ నేతకు సిట్ నోటీసులు
వైఎస్ వివేకానంద రెడ్డి (File)
news18-telugu
Updated: October 15, 2019, 10:11 PM IST
ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేత వర్ల రామయ్యకు సిట్ నోటీసులు పంపింది. వివేకా హత్యపై వర్ల రామయ్య తరచుగా ఆరోపణలు చేస్తూ, దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఏ ఆధారాలతో వివేకా మర్డర్ కేసుపై విచారణ చేస్తున్నా చెప్పాలని.. సీఆర్పీసీ 160 కింద నోటీసులు పంపించారు. సాక్షాలతో సహా సిట్ ఎదుట హాజరై సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సిట్ అధికారులు టీడీపీ నేతకు నోటీసులు పంపడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి చర్చ నీయాంశమైంది.

Video : కొడుకు, కూతురు వల్లే కోడెల ఆత్మహత్య : వర్ల రామయ్య
వర్ల రామయ్య


వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతోంది ఇటీవల వర్ల రామయ్య ఆరోపించారు. నిందితులెవరో జగన్‌కు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయ్ హత్యకేసును జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదని.. కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. అసలు నిందితులను దాచిపెట్టి.. డమ్మీలను తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వివేకా మర్డర్ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్ ఆయనకు నోటీసులు పంపించింది.

First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...