Home /News /politics /

YS VIVEKA MURDER CASE SIT INVESTIGATING LINKS WITH TDP MLC BTECH RAVI BA

వైఎస్ వివేకా హత్య కేసు... టీడీపీ ఎమ్మెల్సీ మెడకు బిగుస్తున్న ఉచ్చు...

తెలుగుదేశం పార్టీ లోగో

తెలుగుదేశం పార్టీ లోగో

2019 ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతోంది.

    మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. వివేకా హత్య జరిగిన రోజు నిందితుడు పరమేశ్వరరెడ్డి ఆస్పత్రిలో ఉన్నాడు. కడప హరిత హోటల్‌లో బీటెక్ రవిని కలిసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హరిత హోటల్లో సిట్ బృందం విచారణ నిర్వహిస్తోంది.

    మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో నిష్పాక్షిక విచారణ జరగాలంటే సీబీఐకి అప్పగించాలని ఆ పిటిషన్‌లో బీటెక్ రవి కోరారు. వైఎస్ వివేకా హత్యకేసును విచారిస్తున్న సిట్ అధికారులు కొన్ని రోజుల క్రితం బీటెక్ రవికి నోటీసుల జారీ చేశారు. తమ విచారణకు హాజరుకావాలని కోరారు. బీటెక్ రవి అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, ఈ కేసును సిట్ అధికారులకు కాకుండా సీబీఐకి అప్పగించాలని బీటెక్ రవి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.

    2019 ఏడాది మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. మాజీ సీఎం తమ్ముడు, ఓ రాజకీయ పార్టీ అధినేత అయిన జగన్ మోహన్ రెడ్డికి బాబాయి, స్వయానా మాజీ మంత్రి కూడా అయిన వైఎస్ వివేకా హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టించింది. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు జగన్ కుటుంబం ప్రయత్నించిందని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ కేసు విచారణకు సిట్‌ను నియమించింది. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడు నెలలు గడిచినా కూడా ఇంకా బాబాయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోయారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు బాగా పెరిగాయి. ఈ క్రమంలో సిట్ విచారణ వేగవంతం చేసినట్టు కనిపిస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Tdp, Ys viveka murder case

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు