Home /News /politics /

YS VIJAYAMMA TAKES ON CHANDRABABU NAIDU OVER HIS COMMENTS ON ROJA MS

భన్వర్ లాల్‌కు రోజాకు సంబంధం ఉందని చెప్పడానికి సిగ్గుందా? : బాబుపై విజయమ్మ ఫైర్

ఎన్నికల ప్రచారంలో వైఎస్ విజయమ్మ(ఫైల్ ఫోటో)

ఎన్నికల ప్రచారంలో వైఎస్ విజయమ్మ(ఫైల్ ఫోటో)

అనంతపురం జిల్లా తన పుట్టినిల్లు అని.. జిల్లాకు మనువడైన జగన్‌ను ఇక్కడి ప్రజలు దీవించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్‌కు రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని విజయమ్మ కోరారు.

ఇంకా చదవండి ...
    ఏపీలో చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని.. ఆఖరికి మహిళల మాన ప్రాణాలపై కూడా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫైర్ అయ్యారు. రోజాకు, భన్వర్ లాల్‌కు సంబంధం ఉందని చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గుందా? అని ప్రశ్నించారు. ఆడవాళ్లను గౌరవించే పద్దతి ఇదేనా అని నిలదీశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో చంద్రబాబు అనేక డ్రామాలకు తెరలేపారని.. గుండెపోటు వచ్చిందని డ్రామా ఆడే అవకాశం కూడా ఉందని విమర్శించారు. ప్రజలంతా చంద్రబాబు డ్రామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతపురం జిల్లా నార్పలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విజయమ్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

    వైఎస్ జగన్‌ సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటారని విజయమ్మ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని.. జగన్‌ సీఎం అయిన తక్షణం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని చెప్పారు. అనంతపురం జిల్లా తన పుట్టినిల్లు అని.. జిల్లాకు మనువడైన జగన్‌ను ఇక్కడి ప్రజలు దీవించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్‌కు రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని విజయమ్మ కోరారు.

    చంద్రబాబు బీసీ, మైనారిటీల ద్రోహి అని, మైనారిటీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని అన్నారు. అదే సమయంలో వైఎస్ జగన్ బీసీలకు పెద్ద పీట వేశారని గుర్తుచేశారు.
    ఏపీలో చంద్రబాబు ఓ రౌడీలా తయారయ్యాడని.. తాట తీస్తా.. ఫినిష్ చేస్తా.. అని బెదిరించడం ఆయనకు మామూలైపోయిందని మండిపడ్డారు. ఏపీ ప్రజల డేటా చోరీ చేసిన దొంగ చంద్రబాబు అని.. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని ఆరోపించారు. జగన్‌ను గెలిపిస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తాడని భరోసా ఇచ్చారు.
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Ys jagan, Ysrcp

    తదుపరి వార్తలు