జగన్ ప్రమాణస్వీకారం రోజు అందుకే ఏడ్చా.. విజయమ్మ

జగన్ మోహన్ రెడ్డిపాలనలో టీడీపీ అవినీతి అంతా బయటకు వస్తుందని విజయమ్మ తెలిపారు. చంద్రబాబునాయుడి పాలనలో అక్రమాలపై తప్పకుండా విచారణ జరుగుతుందన్నారు.

news18-telugu
Updated: September 1, 2019, 9:11 PM IST
జగన్ ప్రమాణస్వీకారం రోజు అందుకే ఏడ్చా.. విజయమ్మ
స్థానికులకు 75 శాతం రిజర్వేషన్
  • Share this:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మూడు నెలలు పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ఆయన వంద రోజుల పాలనను విజయవంతంగా పూర్తిచేసుకోబోతున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మీద ఆయన తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి పాలనతో పాటు వైఎస్ మరణం, ఆ తర్వాత పదేళ్ల ప్రయాణంపై మనసు విప్పారు. సాక్షి ఛానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. మే 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో స్టేజ్ మీద ఉన్న వైఎస్ విజయమ్మ కంటతడిపెట్టారు. కొడుకు సీఎం అయిన సంతోషంలో ఆమె కంట ఆనందభాష్పాలు వచ్చాయంటూ అందరూ భావించారు. అయితే, ఆ రోజు తాను కన్నీరు పెట్టుకోవడానికి కారణాన్ని ఇప్పుడు వెల్లడించారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ అవినీతిరహిత పాలన మీద ప్రసంగిస్తున్నాడు. తాను ఎంత పారదర్శకంగా ఉంటానో చెబుతున్నాడు. ఆ సమయంలో నాకు కాలం గిర్రున తిరిగినట్టు అనిపించింది. వైఎస్ చనిపోయినప్పటి నుంచి సీబీఐ విచారణ వరకు.. సీఎం అయ్యే వరకు కూడా తొమ్మిదేళ్లపాటు జగన్‌ను అవినీతిపరుడు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఆ సమయంలో ఎవరెవరు ఏమేం మాటలు అన్నారో అన్నీ నాకు గుర్తొచ్చాయి. ఏడవకూడదని అనిపించినా కన్నీరు ఆగలేదు.

వైఎస్ విజయమ్మ,వైసీపీ గౌరవాధ్యక్షురాలు


జగన్ మోహన్ రెడ్డిపాలనలో టీడీపీ అవినీతి అంతా బయటకు వస్తుందని విజయమ్మ తెలిపారు. చంద్రబాబునాయుడి పాలనలో అక్రమాలపై తప్పకుండా విచారణ జరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో జగన్ సత్సంబంధాలు నెరుపుతున్నారని చెప్పారు. జగన్‌ను దూరం చేసుకోవాల్సిన అవసరం వారికి కూడా లేదన్నారు. ఇద్దరి మధ్య కేంద్రం, రాష్ట్రాలకు ఉండాల్సిన సత్సంబంధాలు ఉన్నాయన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టినప్పుడు కూడా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడు జగన్‌ కూడా అదే పరిస్థితిలో ఉన్నారన్నారు. అయితే, దేవుడు - ప్రకృతి సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
First published: September 1, 2019, 9:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading