జగన్ 100 రోజుల పాలనపై విజయమ్మ స్పందన.. ఆ ఒక్కటీ అమలు కష్టమేమో...

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సలహాలు, సూచనలు ఇచ్చేదాన్నని విజయమ్మ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డికి కూడా సలహాలు ఇస్తున్నానన్నారు.

news18-telugu
Updated: September 1, 2019, 8:33 PM IST
జగన్ 100 రోజుల పాలనపై విజయమ్మ స్పందన.. ఆ ఒక్కటీ అమలు కష్టమేమో...
వైఎస్ విజయమ్మ పుట్టినరోజు వేడుకలు (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చూసి మూడు నెలలు పూర్తయింది. మరికొన్ని రోజుల్లో వంద రోజుల పాలన పూర్తి చేసుకోబోతున్నారు. జగన్ మోహన్ రెడ్డి మూడు నెలల పాలన మీద ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అన్నీ ధ్వంసం చేయడం, రివర్స్ టెండరింగ్ అంటూ పాలనను రివర్స్‌లో పడేశారని విమర్శిస్తున్నాయి. అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి, వైఎస్ విజయమ్మ.. తన కుమారుడి పాలన మీద తొలిసారి స్పందించారు. సాక్షి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వంద రోజుల పాలనను పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదు. ఇది సినిమా కాదు. వంద రోజులు గొప్పగా నడిచిందనడానికి. ఇది ప్రతి రోజూ కార్యక్రమం. ప్రతి నిమిషం ప్రజల కోసం పనిచేయడం.’ అని విజయమ్మ అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే ఆయనకంటే మెరుగ్గా పరిపాలన అందించాలని జగన్ తపనపడుతున్నారని విజయమ్మ అన్నారు. మేనిఫెస్టోను అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లి ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు, పిల్లలు బాధపడ్డారని విజయమ్మ అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా కూడా మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలని జగన్ భావిస్తున్నారని విజయమ్మ తెలిపారు. అయితే, అది అమలు చేయడం కష్టమేమో అనిపిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సలహాలు, సూచనలు ఇచ్చేదాన్నని విజయమ్మ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డికి కూడా సలహాలు ఇస్తున్నానన్నారు. ముఖ్యంగా నెగిటివ్ అంశాల గురించి చెబుతానన్నారు. రాజధాని మీద విపక్షాలు ప్రచారంలో నిజం లేదని విజయమ్మ అభిప్రాయపడ్డారు. అయితే, అమరావతి గురించి జగన్‌తో తాను చర్చించలేదని చెప్పారు.
First published: September 1, 2019, 8:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading