YS Sharmila: షర్మిల కోసం తెరవెనుక ప్రయత్నాలు.. ఆ నేతలకు ఫోన్లు..

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Vijayamma-YS Vijayamma: షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీలో చేరేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నా.. ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఎంత మేరకు రాణిస్తుందనే అంశంపై మాత్రం చాలామంది నాయకుల్లో సందేహాలు నెలకొన్నాయి.

  • Share this:
    తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు షర్మిల.. ఏప్రిల్ 9న తన పార్టీ పేరును ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అంతకంటే ముందే వివిధ జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో సమావేశమవుతున్న షర్మిల... తన కొత్త పార్టీ ఎలా ఉండాలనే దానిపై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. అయితే షర్మిల కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాలపై ఏ రకమైన ప్రభావం చూపిస్తుందనే అంశంపై అనేక విశ్లేషణులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీలో చేరేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నా.. ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఎంత మేరకు రాణిస్తుందనే అంశంపై మాత్రం చాలామంది నాయకుల్లో సందేహాలు నెలకొన్నాయి.

    ఈ కారణంగానే చాలామంది నాయకులు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారనే టాక్ ఉంది. అయితే తెలంగాణలో షర్మిల ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలోకి నేతలు వచ్చేలా చేయడంలో తెరవెనుక బాధ్యతలను ఆమె తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో వైఎస్ఆర్‌తో పాటు వైసీపీలో పని చేసిన అనేక మంది నేతలకు విజయమ్మ ఫోన్ చేసిన ఈ అంశంపై మాట్లాడారని తెలుస్తోంది.

    YS Vijayamma reaction on Jagan attack case
    వైఎస్ విజయమ్మ (ఫైల్ ఫోటో)


    తెలంగాణలో షర్మిలకు అండగా ఉండాలని.. ఆమె పెట్టబోయే కొత్త పార్టీలో చేరాలని విజయమ్మ కొందరు నేతలను ఫోన్ చేసిన కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గతంలో ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న ముఖ్యనేత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతకుముందు తన తల్లి విజయమ్మ ఆశీస్సులు మద్దతు తనకు ఉన్నాయని కొద్దిరోజులు క్రితం షర్మిల ప్రకటించారు. అయితే తన సోదరుడు జగన్‌కు తాను పార్టీ పెట్టడం ఇష్టంలేదని షర్మిల బాహాటంగానే ప్రకటించారు. అయితే విజయమ్మ షర్మిల రాజకీయ ఎదుగుదల కోసం ఇంతగా శ్రమిస్తున్నారని మాత్రం ఎవరూ ఊహించలేదు.
    Published by:Kishore Akkaladevi
    First published: