ఇదీ.. యాత్ర సినిమాపై వైఎస్ విజయమ్మ అభిప్రాయం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని నేతగా అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమానే యాత్ర. ఈ సినిమాపై వైఎస్ కుటుంబీకుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసా?

news18-telugu
Updated: February 11, 2019, 5:56 PM IST
ఇదీ.. యాత్ర సినిమాపై వైఎస్ విజయమ్మ అభిప్రాయం
వైయస్ విజయమ్మ గా ఆశ్రితా వేముగంటి
news18-telugu
Updated: February 11, 2019, 5:56 PM IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ పాదయాత్ర చేసి.. 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆ యాత్రే ఆయన రాజకీయ జీవితాన్ని ఓ మలుపు తిప్పేసింది. ఆయనను రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. నాటి రాజకీయాల్లో అలాంటి కీలక మలుపునకు కారణమైన వైఎస్ పాదయాత్రే కీలకాంశంగా తెరకెక్కిన సినిమా యాత్ర. ఈ సినిమాపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్ రాజశేఖర్ ‌రెడ్డిని కళ్లకు కట్టినట్టు మరోసారి ప్రజలకు చూపించారన్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో యాత్ర సినిమాను వీక్షించిన విజయమ్మ... రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతంగా ఉందన్నారు. ఇంత మంచి చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ మహిరెడ్డికి, చిత్ర బృందానికి అభినందలు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆశయాలను, రాజకీయ జీవితాన్ని.. మరోసారి ప్రజల కళ్లకు కట్టినట్టు చూపారని ప్రశంసించారు.

Mammootty Yatra movie 2 days Worldwide Collections.. YSR Biopic dominating Box Office pk.. అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది యాత్ర సినిమా. మ‌మ్ముట్టి హీరోగా వైఎస్ పాద‌యాత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. తొలిరోజే మంచి టాక్ తెచ్చుకున్న యాత్ర‌కు క‌లెక్ష‌న్లు బాగానే వ‌స్తున్నాయి. Yatra movie Collections,Yatra movie 2 days Collections,yatra 2 days ww collections,Yatra Worldwide Collections,yatra ww collections,mammotty yatra collections,ysr biopic yatra movie collections,Yatra movie 2 days Worldwide Collections,యాత్ర వసూళ్లు,యాత్ర కలెక్షన్స్,యాత్ర 2 రోజుల కలెక్షన్స్,వైఎస్ఆర్ యాత్ర కలెక్షన్స్,తెలుగు సినిమా
యాత్ర పోస్టర్


ఆనాడు, రాజశేఖర్‌రెడ్డిని ఆదరించిన ప్రజలు.. ఇప్పుడు ఆయన పిల్లలను కూడా అక్కున చేర్చుకుంటున్నారని విజయమ్మ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ దన్యవాదాలు తెలిపారు.

 Yatra movie 3 days Worldwide Collections.. YSR Biopic doing wonders at Box Office pk.. రోజురోజుకీ యాత్ర దూకుడు పెరుగుతుంది. మెల్ల‌గా ఈ చిత్రం వైపు అడుగులు వేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇప్పుడిప్పుడే క‌లెక్ష‌న్లు పెరుగుతున్నాయి. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కాస్త వ‌సూళ్లు త‌గ్గిన‌ట్లు అనిపించినా.. మూడో రోజు మాత్రం దుమ్ము దులిపేసింది ఈ చిత్రం. Yatra movie Collections,Yatra movie 3 days Collections,yatra 3 days ww collections,Yatra Worldwide Collections,yatra ww collections,mammotty yatra collections,ysr biopic yatra movie collections,Yatra movie 3 days Worldwide Collections,యాత్ర వసూళ్లు,యాత్ర కలెక్షన్స్,యాత్ర 3 రోజుల కలెక్షన్స్,వైఎస్ఆర్ యాత్ర కలెక్షన్స్,తెలుగు సినిమా
యాత్ర పోస్టర్


వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ఆధారంగా యాత్ర మూవీని దర్శకుడు మహిరెడ్డి తెరకెక్కించాడు. వైఎస్‌ పాత్రలో మమ్ముట్టి నటించిన ఈ సినిమా ఇటీవలె విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...