• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • YS SHARMILA WAS HIGHLY CRITICIZED OF CM KCR AS A TWITTER PLATFORM VB

YS Sharmila: కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు.. ఇంకెన్నాళ్లు మూతకండ్ల పరిపాలన అంటూ ట్వీట్..

వైఎస్ షర్మిల, సీఎం కేసీఆర్

YS Sharmila: తెలంగాణలో వైఎస్ షర్మిల విమర్శల ట్వీట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటానంటూ దీక్ష చేసిన దగ్గర నుంచి సీఎం కేసీఆర్ పై ప్రభుత్వ వైఫల్యాల గురించి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కేసీఆర్‌ను మరో సారి విమర్శిస్తు ట్వీట్ చేశారు.

  • Share this:
    తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడ‌నే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్న‌య్‌. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందించండంటూ అంటూ సీఎం కేసీఆర్ ను విమర్శించారు. ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యక్సిన్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొకొల్లలుగా ఎలా దొరుకుతున్నాయంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నయి కేసీఆర్ సారూ...? మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..? అని కేసీఆర్‌పై షర్మిల ఘాటు ట్వీట్ చేశారు.


    ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చలగాటమాడుతుందంటూ సీఎంను విమర్శించారు. వైఎస్ షర్మిల ట్వీట్ కు ప్రభుత్వ పాలన గాడి తప్పిందంటూ నెటిజన్లు రీ ట్వీట్ చేశారు.
    Published by:Veera Babu
    First published: