తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలా రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఆ పార్టీని రాజకీయంగా ఎదుర్కోనేందుకు అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దమవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలా రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఆ పార్టీని రాజకీయంగా ఎదుర్కోనేందుకు అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దమవుతుంది. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టుగా మహిళ నేతను మరో మహిళనేత తోనే చెక్ పెట్టేందుకు అధికార పార్టీ పావులు కదుపుతుంది. వైఎస్ఆర్ అభిమానులే లక్ష్యంగా వైఎస్ షర్మిల తెలంగాణ లో కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్దమయ్యారు. పెద్ద ఎత్తున యూత్ ను, మహిళలను, మైనార్టీలను ఆకర్శించేందుకు ఆమె వ్యూహలు సిద్ద చేసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి అనే కోణంలో మేధావులతో చర్చలు జరుపుతున్నారు. మరో వైపు పార్టీలో ఎలాంటి వారిని చేర్చుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచాలనే విషయాలపై మేదోమథనం జరుగుతుంది. షర్మిల పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు మైనార్టీలే ఆయువు పట్టు ఆలాంటి ఓటు బ్యాంక్ ను షర్మిల తన పార్టీ వైపు తిప్పుకుంటే ఈ రెండు పార్టీలకు తీవ్రనష్టం జరుగుతుంది.
షర్మిల స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయ, తెలంగాణ బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఎమ్మెల్సీ కవితను రంగంలోకి దింపుతున్నారు. తెలంగాణలో మహిళల్లో కవితకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ బతుకమ్మగా పిలుస్తారు. మరో వైపు యూత్ లో కూడా మంచి లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే ఇప్పటి వరకు కొంత స్థబ్దుగా ఉన్న ఆమె ఇప్పుడు బాగా యాక్టివ్ గా మారారు. ఇటు మైనార్టీలను, ఆటు హిందువులను ఆకర్షించేదుకు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. గత గురువారం జగిత్యాల జిల్లాలో కొండగట్టు అంజన్న దర్శనం చేసుకున్న ఎమ్మెల్సీ కవిత... హనుమాన్ చాలీసా చదివారు. హిందూ బంధువులను ఆకర్షించారు. మరో వైపు మార్చ్ 1 హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లా జన్నేపల్లి వరకు దారిపొడవునా కవితకు నీరాజనాలు పట్టారు.
కవితకు ఘనస్వాగతం
జనసంద్రాన్ని తలపించేలా రోడ్లపైకి జనాలు వచ్చారు. జన్నేపల్లి శివాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఇలా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటూ అందరినీ తనవైపుకు తిప్పుకుంటున్నారు.. ప్రస్థుత పరిస్థితుల్లో ప్రజలకు చేరువైన నేతగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఏ సమస్యలు ఉన్నాయని విషయాలపై మంచి ఆవగహన ఉంది. దీంతో ఎక్కడైనా నెగ్గుకు రావచ్చు అనే దీమా టీఆర్ ఎస్ పార్టీలో ఉంది. ఏది ఏమైనా వైఎస్ షర్మిల పార్టీ వల్ల ఎవరికి ఎంతమేర నష్టం జరుగుతుందనే వచ్చే ఎలక్షన్ వరకు ఆగాల్సిందే.