జగన్ ఆరునెలల పాలనపై సోదరి షర్మిల ఏమన్నారంటే ?

news18-telugu
Updated: November 30, 2019, 12:43 PM IST
జగన్ ఆరునెలల పాలనపై సోదరి షర్మిల ఏమన్నారంటే ?
వైఎస్ షర్మిల
  • Share this:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఆరునెలలు పూర్తియ్యింది. ఈ సందర్భంగా ఆయనకు సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మంత్రులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా జగన్ సోదరి షర్మిల కూడా ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో తన అన్నకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మెసేజ్ పెట్టారు. ఆరెనెలలుగా ఏపీలో జగన్ చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రస్తావిస్తూ షర్మిల ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా, ఫించన్ల పథకం, నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, మత్స్యకార పథకం, చదువుల విప్లవం, మద్యపాన నిషేధం ఇలా జగన్ ఈ ఆరునెలల కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాల్ని వీడియో రూపంలో షర్మిల ట్వీట్ చేశారు. ‘ఈ ప్రభుత్వానికి మీ చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని.. రాష్ట్ర ప్రగతికి నేను వేస్తున్న ప్రతి అడుగులో మీరంతా అండగా నిలవాలని కోరుకుంటున్నాను’ అంటూ తెలిపారు.

ఆ తర్వాత జగన్ పాలనపై మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కూడా ట్వీట్ చేశారు. జగన్ 6నెలల పాలనపై ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూ పొగడ్తల వర్షం కురిపించారు.











First published: November 30, 2019, 12:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading