మీ నగరాన్ని ఎంచుకోండి

    హోమ్ /వార్తలు /politics /

    పోలవరం రివర్స్ టెండరింగ్‌పై వైఎస్ షర్మిల ట్వీట్

    పోలవరం రివర్స్ టెండరింగ్‌పై వైఎస్ షర్మిల ట్వీట్

     పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తొలి అడుగు ఘనంగా వేసింది. కాంట్రాక్టు సంస్ధ మ్యాక్స్ ఇన్ ఫ్రా మెడలు వంచి అదే పనిని వారికే అప్పగించడంతో పాటు కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కాపాడగలిగింది.

      పోలవరం రివర్స్ టెండరింగ్‌పై సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల స్పందించారు. దీనిపై ఆమె ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘పోలవరం లెఫ్ట్ కనెక్టివిటీ పనుల్లో 65 వ ప్యాకేజీ రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వానికి 58కోట్ల ఆదా అయినందుకు గర్వపడుతున్నా’  అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. తాను చేసిన ట్వీట్‌కి మిషన్ పోలవరం అనే హెడ్డింగ్‌తో అసెంబ్లీలో జగన్ పోలవరంపై మాట్లాడిన స్పీచ్‌ను కూడా పోస్టు చేశారు షర్మిల. ఎన్నికల ప్రచారంలో చురుకుగా ఉన్న జగన్ సోదరి షర్మిల ఎన్నికల ఫలితాల తర్వాతా పెద్దగా ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆమెకు జగన్ కీలక పదవి ఇస్తారన్న వార్తలు వచ్చినా కూడా అది జరగలేదు. దివంగత సీఎం వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో భాగంగా అన్న జగన్‌తో పాటు ఇడుపులపాయలో కనిపించారు. తండ్రి సమాధి వద్ద నివాళుర్పించారు.

      ఇప్పుడు తాజగా పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విధానం సక్సెస్ అవ్వడంతో వైఎస్ షర్మిల స్పందించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రభుత్వానికి రూ. 58కోట్లు ఆదా అవ్వడం గర్వపడుతున్నానన్నారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తొలి అడుగు ఘనంగా వేసింది. 65వ నంబరు ప్యాకేజీ పనుల్లో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో ఏకంగా 58.53 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఆదా చేయడమే కాకుండా గతంలో పనులు తీసుకున్న కాంట్రాక్టర్ కే పనులు అప్పగించడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది.

      అంటే కాంట్రాక్టు సంస్ధ మ్యాక్స్ ఇన్ ఫ్రా మెడలు వంచి అదే పనిని వారికే అప్పగించడంతో పాటు కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కాపాడగలిగింది. కేవలం ఒక్క ప్యాకేజీలోనే దాదాపు 60 కోట్ల రూపాయలు మిగిలితే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో వందల కోట్ల రూపాయలు మిగిల్చేందుకు అవకాశం ఉందని నిన్నటి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా స్పష్టంగా చెప్పినట్లయింది. ఇప్పుడు పోలవరం ప్రధాన ప్రాజెక్టు పనుల్లో ఇదే రివర్స్ టెండరింగ్ అమలయితే ఎన్ని కోట్లు మిగులుతాయో అని నిపుణులు సైతం ఎదురు చూడాల్సిన పరిస్ధితి.

      First published:

      ఉత్తమ కథలు