• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YS SHARMILA TAKING CARE ABOUT HER NEW PARTY AND AVOIDING ANDHRA BRAND FOR HER NEW PARTY BK

YS Sharmila: ఆ విష‌యంలో జాగ్ర‌త్త‌ప‌డుతున్న వైఎస్ ష‌ర్మిళ‌?

YS Sharmila: ఆ విష‌యంలో జాగ్ర‌త్త‌ప‌డుతున్న వైఎస్ ష‌ర్మిళ‌?

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

పార్టీ పెట్టే త‌రువాత వ‌చ్చే ప్ర‌త్యార్ధి విమ‌ర్శ‌ల‌ను ఎలా తిప్పికొట్టాలో ముందుగానే వ్యూహాన్ని రెడీ చేసుకుంటున్నారు వైఎస్ ష‌ర్మిళ‌. త్వ‌ర‌లో పార్టీ ప్ర‌క‌టించ‌బోతున్న నేప‌ధ్యంలో తాను పెట్ట‌బోయే పార్టీకి ఆంధ్ర పార్టీ అనే ముద్ర లేకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు ష‌ర్మిళ‌. అందులో భాగంగానే ఇప్ప‌టి నుంచి త‌న స్థానిక‌త అంశంపై ఆమె అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప‌దే ప‌దే స్ప‌ష్ట‌త ఇవ్వ‌డంతోపాటు కేసీఆర్, విజ‌య‌శాంతిలాంటి నేత‌ల స్థానిక‌త ఏంట‌ని ఎదురుదాడు చేసే ప్ర‌య‌త్నం చేస్తోన్నారు.

  • Last Updated:
  • Share this:
    త్వ‌ర‌లో పార్టీ ప్ర‌క‌టించ‌డానికి రెడీ అవుతున్న ష‌ర్మిళ తెలంగాణ‌లో ఎక్క‌డ త‌న పార్టీ ఆంధ్ర పార్టీ అనే ముద్ర ప‌డ‌కుండా జాగ్ర‌త్తప‌డుతున్నారు. ఇందులో భాగంగా పార్టీలోకి వ‌చ్చే నేత‌ల ఎంపిక విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్న‌ట్లు ష‌ర్మిళ స‌న్నిహితులు చెబుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత అప్ప‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న పార్టీల‌న్ని తెలంగాణ‌లో కూడా విస్త‌రించాడానికి ప్రణాళిక‌లు రూపోందించుకున్నాయి. ముఖ్యంగా టీడీపీ 2014 ఎన్నిక‌ల్లో విసృత ప్ర‌చారం చేసింది. కేసీఆర్ చంద్ర‌బాబుల మ‌ధ్య మాట‌ల యుద్ధాలు నువ్వా నేనా అన్న‌ట్లు సాగాయి కూడా అయితే చంద్ర‌బాబు పార్టీ ఆంధ్ర‌పార్టీ అని మ‌ళ్లీ ఆంధ్రోళ్ల‌కి అధికారం క‌ట్ట‌పెడ‌తారా అనే స్లోగ‌న్ ను తెలంగాణ ప్ర‌జ‌లు బాగా చెవికెక్కించుకున్నారు దీంతో తెలంగాణ‌లో కూడా పాగా వేద్దామ‌నుకున్న బాబు ఆలోచ‌న‌ల‌కు ఆదిలోనే బ్రేకులు ప‌డ్డాయి. అప్ప‌టి నుంచి పార్టీకి తెలంగాణ‌లో వింగ్ ఉన్న‌ప్ప‌టికి ఎదో ఉంద‌నే విధంగా ఉంది త‌ప్ప పెద్ద ప్ర‌భావం చూప‌డం లేదు. ఇక వైసీపీ ప‌రిస్థితి చెప్ప‌న‌వ‌స‌రం లేదు అప్ప‌టి ఎన్నిక‌ల్లో కాస్త మెరుగైన ఫ‌లితాలు చూపించిన జ‌గ‌న్ కు కేసీఆర్ తో ఉన్న స‌న్నిహిత సంబంధాల వ‌ల‌న త‌న పై పెద్దగా మాట్లాడ‌లేని ప‌రిస్థితి.

    అయితే ఇప్పుడు తాజాగా ష‌ర్మిళ తెలంగాణ‌లో పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ ఈ స్థానిక‌త అంశం ర‌చ్చ చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌నే వాధ‌న‌లు వినిపిస్తోన్నాయి. మ‌ళ్లీ ఆంధ్ర పాల‌న అనే అంశం తెర‌పైకొచ్చి పార్టీ ప్రారంభంలోనే ఎమైన న‌ష్టాన్ని చేకూర్చుతుందా అనే భ‌యాన్ని వ్య‌క్తం చేస్తోన్నారు ష‌ర్మిళ అనుచ‌రులు. అందులో భాగంగానే ష‌ర్మిళ పెట్ట‌బోయే కొత్త పార్టీ లోకి వ‌చ్చే నేత‌ల ఎంపిక విష‌యంలో చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్న‌ట్లు లోటాస్ పౌండ్ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టికే ఏపీలో కొంద‌రు నేత‌ల ద‌గ్గ‌ర నుంచి కూడా పెద్ద సంఖ్య‌లో పార్టీకి చేర‌తామ‌ని ప్ర‌తిపాధ‌న‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి వాటిపై ష‌ర్మిళ ఏం స్పందించ‌లేద‌ని తెలుస్తోంది. పార్టీ ప్ర‌క‌టించిన రోజే త‌న స్థానిక‌త గురించి స్ప‌ష్ట‌మైన స్పీచ్ ఇచ్చే ఆలోచ‌న‌లో ష‌ర్మిళ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ మాట‌కొస్తే కేసీఆర్, విజ‌య‌శాంతులు కూడా తెలంగాణ వాళ్లా అనే వాధ‌న‌ను ష‌ర్మిళ తెల‌ర‌పైకి తీసుకురావాల‌ని భావిస్తోన్న‌ట్లు స‌మ‌చారం.

    అందులో భాగంగానే మొన్న జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో త‌న స్థానిక‌త‌ను గురించి ప్ర‌శ్నించే హాక్కు ఎవ‌రికి లేద‌ని వ్యాఖ్యానించారు ష‌ర్మిళ‌. దీంతో పాటు తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఎం స‌మ‌స్య‌లు తీరాయ‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఇక్క‌డ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీరడం కావాలా?  లేక స్థానిక‌త‌లు కావాలా అనే పాయింట్ ను ఆమె ప‌దేప‌దే చెప్పే ప్ర‌య‌త్నం చేస్తోన్నారు. మొత్తానికి పార్టీ పెట్టాడానికి ముందే ష‌ర్మిళ ప్ర‌త్యార్ధి పార్టీల నుంచి వ‌చ్చే అన్ని స‌మ‌స్య‌ల‌ను ఎలా ఎదుర్కొవాలో ప్రీపేరై ఉన్న‌ట్లు స‌మాచారం.
    Published by:Balakrishna Medabayani
    First published:

    అగ్ర కథనాలు