Home /News /politics /

పిల్లి పిల్లే.. పులి పులే.. సింహం సింగిల్ గానే వస్తుంది : చంద్రబాబుపై షర్మిల ఫైర్

పిల్లి పిల్లే.. పులి పులే.. సింహం సింగిల్ గానే వస్తుంది : చంద్రబాబుపై షర్మిల ఫైర్

వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం (Image : Facebook)

వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం (Image : Facebook)

YS Sharmila on Chandrababu Naidu : ఈ ఎన్నికల్లో జగన్ అన్న బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని దేశవ్యాప్తంగా ఎన్నో సర్వేలు చెబుతున్నాయని చెప్పారు. ఆయనకు ఒక్క అవకాశం ఇస్తే మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తాడని అన్నారు.

    ఏపీ ఎన్నికల ప్రచారంలో టీడీపీపై విమర్శల పదును పెంచుతున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల. సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరు ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన ఆమె.. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా అని చంద్రబాబును ఎద్దేవా చేసిన షర్మిల.. పిల్లి పిల్లే.. పులి పులే అని అన్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో జగన్ అన్న బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమని దేశవ్యాప్తంగా ఎన్నో సర్వేలు చెబుతున్నాయని చెప్పారు. ఆయనకు ఒక్క అవకాశం ఇస్తే మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తాడని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కిలారు రోశయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

    చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గం సంతోషంగా లేదని షర్మిల మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. అదే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు.. ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే ప్రజలు జగన్ అన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన చంద్రబాబు.. ఎందుకు దాన్ని పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. అమరావతిని అమెరికా చేస్తానని, శ్రీకాకుళంను హైదరాబాద్ చేస్తానని మళ్లీ అబద్దాలు చెబుతున్నారని.. ప్రజలు చంద్రబాబును నమ్మవద్దని కోరారు.
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Guntur S01p13, YS Sharmila, Ysrcp

    తదుపరి వార్తలు