Home /News /politics /

YS SHARMILA SATIRES ON AP MINISTER NARA LOKESH SB

అ,ఆలు రావు కానీ... నారా లోకేష్‌పై వైఎస్ షర్మిల సెటైర్లు

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల

మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల

భూతద్దం పెట్టుకొని వెతికినా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జాడే లేదని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు భరోసా ఉండేదన్నారు.

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారామె. అమరావతిలో మీడియా సమావేశం పెట్టిన ఆమె... చంద్రబాబు పాలనలతో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. భూతద్దం పెట్టుకొని వెతికినా అభివృద్ధి జాడే లేదన్నారు. వైఎస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు భరోసా ఉండేదన్నారు. కులాల‌కు, మ‌తాల‌కు, ప్రాంతాల‌కు ఆఖ‌రికి పార్టీల‌కు కూడా అతీతంగా ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వైఎస్సార్‌ ప్ర‌తి వ‌ర్గానికి మేలు చేసిన నాయ‌కుడు అంటూ వైఎస్‌ను గుర్తు చేశారు షర్మిల. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...ఆ తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశారన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు... రైతులను మోసం చేశారని విమర్శించారు.

    తన కోడుకు లోకేష్ కు జాబ్ ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు షర్మిల. జయంతికి వర్థంతికి కూడా తేడా తెలియని వాడు లోకేష్ అంటూ విమర్శించారు. అ ఆలు రావు కానీ అగ్రతాంబూలం అన్నాడంట అంటూ సామెతలు చెప్పి మరీ లోకేష్‌పై సెటైర్లు వేశారు. లోకేష్‌ని మూడు శాఖలకు మంత్రిని చేశారన్నారు. చంద్రబాబు కుమారుడికి మూడు ఉద్యోగాలు, మామూలు ప్రజలకు ఒక్క ఉద్యోగం కూడా లేదంటూ ఆరోపణలు చేశారు షర్మిల. ప్రజల సమాచారం మొత్తం ప్రయివేటు కంపెనీలకు ఇచ్చారన్నారు. బాబు మోడీ జోడీ కలిసి ప్రత్యేక హోదాను ఎగ్గోట్టారన్నారు. వైసీపీ నాయకులు హోదా కోసం అసెంబ్లీని ముట్టడిస్తే వారిని అరెస్టు చేయించలేదా అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోడా? అని అన్నారు. ఆడపిల్ల పుడితే రూపాయలు 25వేలు ఇస్తానన్నారు. ఐదేండ్లలో ఎంతమందికి వచ్చాయన్నారు. ఇంటికో ఉద్యోగం లేకపోతే 2000రూపాయలు ఇస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఇఫ్రాస్టక్చర్ వరకు నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయని చంద్రబాబు మోసపూరిత హామీలు చేస్తున్నారన్నారు షర్మిల.

    ఇది కూడా చూడండి:-


    ఇవికూడా చదవండి:  

    లోకేశ్ కామెంట్స్ మళ్లీ మిస్ ఫైర్.. కేసీఆర్‌ను టార్గెట్ చేయబోయి ఇలా బుక్కయ్యాడు.

    అడ్గంగా వంగిపోయారు... పవన్ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP News, AP Politics, Nara Lokesh, YS Sharmila

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు