వైసీపీ నుంచి రాజ్యసభ రేసులో షర్మిల ?

వైసీపీ తరపున రాజ్యసభకు షర్మిలను ఎంపిక చేస్తే బాగుంటుందని పలువురు వైసీపీ నేతలు సీఎం జగన్‌కు సూచించినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: February 18, 2020, 3:28 PM IST
వైసీపీ నుంచి రాజ్యసభ రేసులో షర్మిల ?
వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)
  • Share this:
వైసీపీ తరపున రాజ్యసభకు ఎంపిక కాబోయే ఆ నలుగురు ఎవరనే దానిపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. మండలి రద్దు కారణంగా మంత్రి పదవులు కోల్పోయే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణకు రాజ్యసభ సీట్లు దాదాపు ఖరారైపోయాయనే ప్రచారం సాగుతోంది. దీంతో పాటు కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ సినీనటుడు చిరంజీవి కూడా వైసీపీ తరపున పెద్దల సభకు ఎంపికయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొన్ని పేర్లు కూడా రాజ్యసభ రేసులో ఉన్నాయి. ఇదిలా ఉంటే... వైసీపీ తరపున రాజ్యసభకు షర్మిలను ఎంపిక చేస్తే బాగుంటుందని పలువురు వైసీపీ నేతలు సీఎం జగన్‌కు సూచించినట్టు తెలుస్తోంది.

షర్మిలను రాజ్యసభకు పంపిస్తే... కేంద్రస్థాయిలో వైసీపీ ఇమేజ్ మరింత పెరుగుతుందని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారు. విజయసాయిరెడ్డితో కలిసి షర్మిల కూడా రాష్ట్రానికి కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే షర్మిలకు పార్టీలో క్రియాశీలక పదవులు ఇచ్చే విషయంలో జగన్ ఆలోచన ఏ విధంగా ఉందనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. గతంలో షర్మిలకు వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా వైసీపీ తరపున రాజ్యసభ రేసులో షర్మిల ఉన్నట్టు ప్రచారం జరుగుతుండటం విశేషం.First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు