YS Sharmila: పాదయాత్రపై షర్మిల కీలక ప్రకటన.. చేవేళ్ల నుంచి మొదలు.. ముగింపు ఎక్కడంటే..

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో )

YS Sharmila: తెలంగాణలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుందని షర్మిల ప్రకటించారు.

  • Share this:
    తెలంగాణవ్యాప్తంగా అక్టోబర్‌లో పాదయాత్ర చేపడతానని గతంలోనే ప్రకటించిన వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాజాగా పాదయాత్రకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర మొదలుపెడతానని అన్నారు. తన తండ్రి పాదయాత్ర మొదలుపెట్టిన చేవెళ్ల నుంచే పాదయాత్ర మొదలుపెట్టబోతున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ పాదయాత్రకు ప్రజాప్రస్థానం అనే పేరు పెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలను మినహాయిస్తే.. తెలంగాణలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుందని షర్మిల ప్రకటించారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కారాలను కనుక్కోవాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల అన్నారు. చేవెళ్ల నుంచి మొదలుకాబోయే ఈ పాదయాత్ర.. తిరిగి చేవేళ్లలోనే ముగుస్తుందని తెలిపారు. ప్రతి రోజూ 12 నుంచి 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని.. ఏడాది పాటు పాదయాత్ర సాగుతుందని తెలిపారు. కుటుంబ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారేమో ప్రజలకు చెబుతామని షర్మిల అన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేదని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం సేవ చేసేందుకు వైఎస్ఆర్‌టీపీ ఉందని ప్రజలకు తెలియజేస్తామని వ్యాఖ్యానించారు.

    తెలంగాణలో కొద్దినెలల క్రితం పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. ఇక్కడ రాజకీయంగా బలపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక జిల్లాలో నిరుద్యోగ దీక్షలు కూడా చేపట్టారు. అయితే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను దాటుకుని షర్మిల ప్రజల్లో ఆదరణ పొందడంలో సక్సెస్ కాలేకపోతోందనే వాదన వినిపిస్తోంది. ఇక షర్మిల పార్టీలో చేరేందుకు పేరున్న నాయకులెవరూ కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండబోతోందనే అంశాన్ని ఆమె చేపట్టబోయే పాదయాత్ర డిసైడ్ చేయనుందనే వాదన వినిపిస్తోంది.

    Green Chilli: పచ్చి మిర్చిను దూరం పెడుతున్నారా ?..ఈ ప్రయోజనాలు మిస్ అవుతారు

    Revanth Reddy: యముడి గెటప్‌లో రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

    ఈ పాదయాత్ర ద్వారా రాజకీయంగా బలపడితేనే వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన వైఎస్ఆర్‌టీపీ తెలంగాణలో రాణిస్తుందని.. అలా జరగని పక్షంలో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టమవుతుందనే చర్చ జరుగుతోంది. ఏడాదిపాటు తన పాదయాత్ర కొనసాగుతుందని షర్మిల చెప్పిన నేపథ్యంలో.. ఆమె తెలంగాణ రాజకీయాల్లో రాణిస్తారా లేదా అన్నది రాబోయే ఏడాదికాలంలో తెలిసిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిల.. ఇందుకోసం తన పాదయాత్ర మీదే ఆశలుపెట్టుకున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: