YS SHARMILA INVITED ETALA RAJENDER TO THEIR PARTY VB
Etala Rajender-YS Sharmila: ఈటలకు మరో ఆఫర్.. ఇప్పటికే లేటయ్యిందంటూ నెటిజన్ల కామెంట్స్.. పూర్తి వివరాలివే..
ఈటల రాజేందర్, వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)
Etala Rajender-Ys Sharmila: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను వైఎస్ షర్మిల తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని ఆమె అన్నారు. పార్టీ నాయకులతో లోటస్ పాండ్‌లో బుధవారం సమావేశమైన ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అంతా అయిపోయాక ఇప్పుడు ఆహ్వానించడం ఏంటని అందరూ నోరెళ్లబెడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం ఈటల రాజేందర్ (Etala Rajender) వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో ఈటల రాజేందర్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయన ఏ పార్టీలో చేరతారంటూ అనేక చర్చలు జరిగాయి. ఇక ఆయనను ఎలాగైనా తమ పార్టీల్లో చేర్చుకోవాలని అన్ని పార్టీలూ విశ్వ ప్రయత్నాలు చేశాయి. కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ఆఫర్లు కూడా ఇచ్చారు. కానీ చివరకు ఆయన బీజేపీకి జై కొట్టిన విషయం తెలిసిందే. బీసీల్లో బలమైన నాయకుడిగా, రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టున్న నేతగా ఈటల పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఈటల విషయంలో పెద్దగా మాట్లాడని వైఎస్ షర్మిల ఇప్పుడు ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు. అంతా అయిపోయాక ఇప్పుడు ఆహ్వానించడం ఏంటంటూ అందరూ నోరు వెళ్లబెడుతున్నారు. మాజీ మంత్రి ఈటల త్వరలో బీజేపీలో చేరుతాంరటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల(YS Sharmila). మాజీ మంత్రి ఈటల రాజేందర్ వస్తానంటే ఆహ్వానిస్తామని ఆమె అన్నారు. కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని ఆమె అన్నారు. ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని ఆమె అన్నారు. పార్టీ నాయకులతో లోటస్ పాండ్‌లో సమావేశమైన ఆమె.. ఈ వ్యాఖ్యలు చేశారు. కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని, కేసులకు భయపడి బీజేపీలో చేరడం కూడా కామన్ అయిపోయిందన్నారు. తమ పార్టీలోకి ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఈటల విషయంలో తమ పార్టీలో ఎటువంటి చర్చ లేదని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి పేరుతోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(YSR Telangana Party) ఉంటుందన్నారు. టేబుల్ ఫ్యాన్(Table fan) గుర్తుపై ప్రచారాన్ని ఆమె ఖండించారు.
అదంతా ఫూలిష్ ప్రచారం జరుగుతోందన్నారు షర్మిల. ఇప్పటి వరకు గుర్తు ఎంపికపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పార్టీ విధి, విధానాలు రూపొందిస్తామన్నారు. ప్రజల అజెండాను తమ పార్టీ అజెండా అన్నారు. కరోనా విషయంలో ఇప్పటి వరకు కేసీఆర్ పాఠాలు నేర్చుకోలేదన్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనే ఉద్యేశ్యం కేసీఆర్‌కు లేదని, నిద్ర పోతున్నట్లు నటిస్తున్న వారికి ఏం చెప్పలేమన్నారు. కరోనా కట్టడి విషయంలో ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఎలాంటి అనుభవం నేర్చుకోలేదని విమర్శించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.