YS Sharmila: ఆ కుక్కకు కవిత ఏమవుతుందో.. తెలంగాణ మంత్రికి షర్మిల కౌంటర్

షర్మిల, కవిత (ఫైల్ ఫోటో)

YS Sharmila Comments: ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన షర్మిల.. పాదయాత్ర కొనసాగిస్తూనే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. తన పాదయాత్రలో ఎక్కువగా టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

  • Share this:
    తనపై విమర్శలు చేసిన నేతలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాజాపై తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఆయన అదే స్థాయిలో వ్యాఖ్యానించారు. మంత్రి నిరంజన్‌ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేసిన షర్మిల.. ఈ కుక్కకి కవిత (Kavitha)  ఏం అవుతుందో సమాధానం చెప్పాలని నిలదీసారు. అయినా చందమామను చూసి కుక్కలు మొరుగుతాయని అన్నారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడకు పోతుందని మండిపడ్డారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయని షర్మిల (YS Sharmila) అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. మహిళలపై ఈ రకమైన వ్యాఖ్యలు చేసే వారికి బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు.

    అంతకుముందు నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ (TRS)  పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరిందంటూ పరోక్షంగా వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే షర్మిల డిమాండ్ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని ఆయన ఆరోపించారు.

    Minister Niranjan Reddy Comments, Minister Niranjan Reddy controversial comments, telangana news, మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్, మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు, తెలంగాణ న్యూస్
    మంత్రి నిరంజన్ రెడ్డి(ఫైల్ ఫోటో)


    ఇక ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన షర్మిల.. పాదయాత్ర కొనసాగిస్తూనే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. తన పాదయాత్రలో ఎక్కువగా టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తనపై విమర్శలు, సెటైర్లు వేసే వారికి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు వైఎస్ షర్మిల. గతంలో షర్మిల దీక్ష గురించి మంత్రి కేటీఆర్ సెటైర్లు వేయగా.. అదే స్థాయిలో ఆయనకు కౌంటర్ ఇచ్చారు. అసలు కేటీఆర్ ఎవరంటూ కౌంటర్ ఇచ్చారు. మహిళలను గౌరవించడం సీఎం కేసీఆర్‌కే తెలియదని.. అలాంటిది కేటీఆర్ నుంచి ఆ గౌరవం ఎలా ఆశిస్తామని షర్మిల ప్రశ్నించారు.

    Etela Rajendar: పిచ్చి పట్టిందా హరీశ్ ?.. దానితో నాకేం సంబంధం.. మండిపడ్డ ఈటల రాజేందర్

    Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

    ఈ నెల 20 నుంచి తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన షర్మిల.. తన తండ్రి దివంగత వైఎస్ఆర్ మొదలుపెట్టిన చేవేళ్ల నుంచే పాదయాత్ర మొదలుపెట్టారు. ఏడాది పాటు తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించి ముందుకు సాగుతున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: