కరోనా ఎఫెక్ట్‌తో బడ్జెట్ వాయిదా... రేపు జగన్ కీలక నిర్ణయం...

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం లేదు. ఈ క్రమంలో బడ్జెట్ స్థానంలో ఆర్డినెన్స్‌ను తీసుకురావడంపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది.

news18-telugu
Updated: March 26, 2020, 3:17 PM IST
కరోనా ఎఫెక్ట్‌తో బడ్జెట్ వాయిదా... రేపు జగన్ కీలక నిర్ణయం...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి
  • Share this:
కరోనా వైరస్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద కూడా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో మూడు నెలలకు సరిపడా నిధుల కోసం ఆర్డినెన్స్‌తో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రేపు (మార్చి 27)న ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. సాధారణంగా నిర్వహించే సమావేశంలో కాకుండా, సామాజిక దూరం పాటించేలా ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఈసారి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ స్థానంలో ఆర్డినెన్స్‌ను తీసుకురావడంపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. జూన్ 30 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన ఖర్చులను లెక్కించి ఆ మేరకు ఆర్డినెన్స్ సిద్ధం చేస్తారు. ఆ ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌కు పంపనున్నారు. ఈనెల 31 లోపు గవర్నర్ ఆమోదం తెలపడానికి ఆస్కారం ఉంది. గతంలోనూ రెండుసార్లు ఆర్డినెన్స్‌ ద్వారా బడ్జెట్‌ను తీసుకొచ్చారు. 2004లో అప్పటి సీఎ చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లినపుడు, 2014లో రాష్ట్ర విభజన సమయంలో కొంతకాలం రాష్ట్రపతి పాలన విధించినపుడు ఆర్డినెన్స్‌ ద్వారానే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను తీసుకొచ్చారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు