ఫిబ్రవరి 28న సీఎం జగన్ పోలవరం పర్యటన

జగన్ మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టులో పనులు (ప్రతీకాత్మక చిత్రం)

సీఎం జగన్ పోలవరం పర్యటన నేపథ్యంలో ప్రాజెక్ట్ ఇంజినీరింగ్, పునరావాస, పరిహార ప్యాకేజీ అధికారులతో మంగళవారం రాష్ట్ర జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

  • Share this:
    ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు ఏపీ సీఎం. ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు పనుల పురోగతి గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకోనున్నారు. సీఎం జగన్ పోలవరం పర్యటన నేపథ్యంలో ప్రాజెక్ట్ ఇంజినీరింగ్, పునరావాస, పరిహార ప్యాకేజీ అధికారులతో మంగళవారం రాష్ట్ర జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి, పునరావాస ప్యాకేజీ సహా పలు అంశాలపై అధికారులతో చర్చించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: