సీఎం జగన్ ర్యాంకింగ్స్... మహిళా ఎమ్మెల్యేకు ఫస్ట్ ర్యాంక్... మరి లాస్ట్...?

రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ చేపడతామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రమాణస్వీకారం తర్వాత ప్రకటించారు. బాగా పని చేసి జగన్ చేత శెభాష్ అనిపించుకోవాలని ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు.

news18-telugu
Updated: February 8, 2020, 4:37 PM IST
సీఎం జగన్ ర్యాంకింగ్స్... మహిళా ఎమ్మెల్యేకు ఫస్ట్ ర్యాంక్... మరి లాస్ట్...?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు మీద అంతర్గత సర్వేలు చేయించినట్టు తెలుస్తోంది. ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందనే అంశాలను సర్వే చేయించి వాటి వివరాలను తెలుసుకున్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించిన కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ‘గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ సర్వే’ అంటూ అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ సర్వేలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మొదటి స్థానం దక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావుకు రెండో స్థానం, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మూడో స్థానం, బాపట్ల ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ అయిన కోన రఘుపతి నాలుగో స్థానంలో నిలిచారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే పనితీరు మీద కూడా జగన్ సర్వే నిర్వహించినట్టు తెలిసింది. రేపల్లె నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు ఐదో స్థానం దక్కింది.

ap cm ys jagan,tdp mlas,ysrcp mlas,janasena mlas,jagan meeting,jagan jammalmadugu,jagan latest news,market committees,జగన్ మోహన్ రెడ్డి,టీడీపీ ఎమ్మెల్యేలు,వైసీపీ ఎమ్మెల్యేలు,జగన్ జమ్మలమడుగు,జగన్ తాజా వార్తలు,మార్కెట్ కమిటీలు,ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలు, (File)


తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి చిట్టచివరి స్థానంలో నిలిచినట్టు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ప్రతిపక్షాలకు దీటుగా కౌంటర్లు ఇచ్చే అంబటి రాంబాబుకు చివరి నుంచి మూడో స్థానం దక్కింది. గత ఎన్నికల్లో నారా లోకేష్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి చివరి నుంచి రెండోస్థానం దక్కినట్టు తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది?, వారు ప్రజలతో ఎలా మెలుగుతున్నారు?, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్తున్నారా? లేదా?, పార్టీకి వారి వల్ల ఎలాంటి పేరు వస్తుంది? వంటి అంశాల మీద సర్వే చేయించినట్టు తెలిసింది. రాష్ట్రం మొత్తం మీదా ఈ సర్వే నిర్వహించినట్టు సమాచారం.

Ysrcp mla Ambati rambabu targets chandrababu naidu pawan kalyan and bjp ak బీజేపీకి ఏం సంబంధం ?.. పవన్ మారలేదన్న వైసీపీ ఎమ్మెల్యే
అంబటి రాంబాబు
త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి ప్రజలు తమ వైపే ఉన్నారని, తాము తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు ఆమోదం తెలిపారనే అభిప్రాయాన్ని కల్పించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి... దూకుడు నిర్ణయాలతో వెళ్తున్న జగన్‌కు షాక్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం ముందస్తుగా ఇలా సర్వేలు చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది?, ఏయే నియోజకవర్గాల్లో మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో జగన్ సర్వేలు చేయిస్తున్నట్టు తెలిసింది.

అసెంబ్లీలో మాట్లాడుతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి (File)


రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ చేపడతామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రమాణస్వీకారం తర్వాత ప్రకటించారు. దీంతో బాగా పనిచేసి జగన్ చేత శెభాష్ అనిపించుకుంటే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు లభిస్తుందని చాలా మంది ఎమ్మెల్యేలు ఆశ పెట్టుకున్నారు. ఈ క్రమంలో జగన్ కూడా సర్వేలు చేసి ఎవరి పనితీరు ఎలా ఉందని తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.
First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు