వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారో అక్కడే ఆపుతున్నారు. ఇదేదో సినిమా డైలాగ్ కోసం రాసింది కాదు. తిరుమల వెంకన్న సాక్షిగా తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ తిరుపతిలోనే ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కోసం తిరుపతి నుంచే సమరశంఖం పూరించారు. ఫిబ్రవరి 6న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతిలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. ఆ తర్వాత 13 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ముఖ్యంగా తన పాదయాత్ర చేయని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం మీద స్పెషల్ ఫోకస్ చేశారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు (ఏప్రిల్ 9) సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు క్యాంపెయినింగ్ గడువు ముగుస్తుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.