బాలయ్య టార్గెట్‌గా జగన్ ప్లాన్.. ఆ నేతకు పిలిచి పదవి ఇచ్చిన సీఎం

నందమూరి బాలకృష్ణ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఝలక్ ఇచ్చిన నేతకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా పిలిచి ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఝలక్ ఇచ్చిన నేతకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా పిలిచి ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. ఆ నేత ఎవరో కాదు. మహ్మద్ ఇక్బాల్. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి బాలయ్య చేతిలో ఓడిపోయారు. అయితే, ఆ తర్వాత ఆయనకు జగన్ హిందూపురం బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో బాలయ్యకు షాక్ ఇస్తూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి చోట కూడా వైసీపీ జెండా ఎగరేసింది. గ్రామాల్లో పసుపు జెండాల స్థానంలో వైసీపీ జెండాలు ఎగిరాయి. నాలుగోదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హిందూపురం నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరిగాయి.

  హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల తమదే విజయమని వైసీపీ తెలిపింది. అయితే వైసీపీ రెబల్స్ ఎక్కువగా పోటీ చేయడం.. వారు అధికార పార్టీకి చెందిన ఓట్లు కాకుండా టీడీపీ మద్దతు దారుల ఓట్లే చీల్చారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దానికి తోడు అధికార పార్టీ అరాచకాలు చేసి.. బలవంతంగా నెగ్గిందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తనకు తిరుగులేదనకున్న హిందూపురంలో ఈ ఫలితాలు బాలయ్యకు షాక్ అనే చెప్పాలి. బాల‌య్య నేరుగా ప్ర‌చారం చేసినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. బాలయ్యను కూడా కంగారు పెట్టిన ఇక్బాల్‌కు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు సీఎం జగన్. తాజాగా ప్రకటించిన ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇక్బాల్ కూడా ఒకరు.

  ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో టెన్షన్ పెట్టిన ఓటర్లను మళ్లీ ప్రసన్నం చేసుకోవడానికి బాలయ్య రంగంలోకి దిగారు. ఈసారి హిందూపురం మున్సిపాలిటీలో తమ పట్టు నిలబెట్టుకోవడానికి బాల‌య్య క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేసి లోక‌ల్ కేడ‌ర్ తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. వారంలో మూడు రోజుల‌పాటు పార్టీ కేడ‌ర్ తో స‌మావేశాలు ఏర్పాటు చేసి ఎక్క‌డైనా నేత‌ల మ‌ధ్య విభేదాలు ఉంటే వాటి ప‌రిష్క‌రించాల్సిందిగా బాల‌య్య‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వ‌చ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే అధికార పార్టీ నేత‌లు ఇక్క‌డ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తోన్నారు. పార్టీ నేత ఇక్భాల్ ఇప్ప‌టికే మున్సిపాలిటీ మొత్తం తిరుగుతూ కేడ‌ర్ లో ఉత్సాహాం నింపుతున్నారు. ఈ నేప‌ధ్యంలో ఇక్క‌డ ఎలాంటి ఫ‌లితాలు రాబోతున్నాయ‌నే ఆస‌క్తి అంద‌రిల్లో నెల‌కుంది. తాజాగా ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా పదవి ఖరారు చేయడంతో ఆయన మరింత దూకుడుగా వెళ్లనున్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: