రేపే జగన్ గృహప్రవేశం.. కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదు?

ఫిబ్రవరి 14వ తేదీనే గృహప్రవేశం జరగాల్సి ఉంది. అయితే, జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల, బావ అనిల్ కుమార్ అనారోగ్యం కారణంగా వాయిదా పడింది.

news18-telugu
Updated: February 26, 2019, 10:03 PM IST
రేపే జగన్ గృహప్రవేశం.. కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదు?
27న జగన్ మోహన్ రెడ్డి కొత్త ఇంటి గృహప్రవేశం
  • Share this:
వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో నిర్మించిన కొత్త ఇంట్లో బుధవారం గృహప్రవేశం చేయనున్నారు. రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంట్లో జగన్ మోహన్ రెడ్డి అడుగుపెడుతున్నారు. అలాగే, పార్టీ కార్యాలయాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ టూర్‌లో ఉన్నారు. 27వ తేదీ తెల్లవారుజామున జగన్ మోహన్ రెడ్డి, భార్య భారతిరెడ్డి తిరిగివస్తారు. అనంతరం తాడేపల్లిలో గృహప్రవేశం చేస్తారు. ఫిబ్రవరి 14వ తేదీనే గృహప్రవేశం జరగాల్సి ఉంది. అయితే, జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల, బావ అనిల్ కుమార్ అనారోగ్యం కారణంగా వాయిదా పడింది.

YS Jaganmohan Reddy, Jagan House warming, Jagan house, YS Jagan Tadepalli House, YSR Congress Party office, YSRCP Office Photos, YSRCP office, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జగన్ గృహప్రవేశం, జగన్ కొత్త ఇల్లు, జగన్ ఇల్లు ఫొటోలు, వైసీపీ ఆఫీసు, వైసీపీ కార్యాలయం
27న జగన్ మోహన్ రెడ్డి కొత్త ఇంటి గృహప్రవేశం


జగన్ మోహన్ రెడ్డి నివాసం, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత పలువురు నేతలు వైసీపీలో చేరనున్నారు. ఇటీవల టీడీపీని వీడిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, బీజేపీ నేత పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

YS Jaganmohan Reddy, Jagan House warming, Jagan house, YS Jagan Tadepalli House, YSR Congress Party office, YSRCP Office Photos, YSRCP office, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జగన్ గృహప్రవేశం, జగన్ కొత్త ఇల్లు, జగన్ ఇల్లు ఫొటోలు, వైసీపీ ఆఫీసు, వైసీపీ కార్యాలయం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ చెంచురాం (File)
జగన్ గృహప్రవేశానికి కేసీఆర్ హాజరుకావడం లేదని తెలుస్తోంది. 14వ తేదీన జరిగే గృహప్రవేశానికి వెళ్తారని తొలుత ప్రచారం జరిగింది. అదే రోజు విశాఖలోని శారదాపీఠంలో జరిగే ఓ పూజకు హాజరుకావాల్సి ఉంది. జగన్ గృహప్రవేశం వాయిదా పడడంతో కేసీఆర్ కూడా విశాఖ టూర్‌ను రద్దు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదనే అంశం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం
First published: February 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>