జగన్ ప్రభుత్వం సంచలనం... సీఆర్డీఏ చట్టం రద్దు... రైతుల ప్లాట్లపై కీలక నిర్ణయం...

చంద్రబాబునాయుడు హయాంలో వచ్చిన కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (సీఆర్డీఏ) చట్టం 2014ను వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేయనుంది. రేపు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు.

news18-telugu
Updated: January 19, 2020, 4:51 PM IST
జగన్ ప్రభుత్వం సంచలనం... సీఆర్డీఏ చట్టం రద్దు... రైతుల ప్లాట్లపై కీలక నిర్ణయం...
సీఆర్డీఏ కార్యాలయం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబునాయుడు హయాంలో వచ్చిన కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (సీఆర్డీఏ) చట్టం 2014ను రద్దు చేయనుంది. రేపు (20 జనవరి, సోమవారం) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే రెండు కీలక బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. అందులో సీఆర్డీఏ చట్టం రద్దు కూడా ఒకటి. పాత చట్టాన్ని, సీఆర్డీఏని రద్దు చేసి ఆ స్థానంలో కొత్తగా మరో చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది.

కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత సీఆర్డీఏ చట్టంలో ఉన్న నిబంధనలు, దాని కింద జారీ చేసిన నోటిఫికేషన్లు, జీవోలు అన్ని రద్దయిపోతాయి. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టంలోనివే అమలవుతాయి. గతంలో ఉన్న విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ పునఃప్రారంభమవుతుంది. సీఆర్డీఏ పరిధి మొత్తం దానికిందకే వస్తుంది. సీఆర్డీఏ కింద తీసుకున్న అన్ని రుణాలు VGMTUDA కి బదిలీ అవుతాయి. ఆ రుణాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది. సీఆర్డీఏలో నియమితులైన ఉద్యోగులు అందరూ VGMTUDA కి బదిలీ అవుతారు. సీఆర్డీఏలో అభివృద్ధికి గతంలో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం మళ్లీ కొత్తగా చేసుకుంటుంది.

సీఆర్డీఏచట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో కొత్త చట్టం తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం


భూసమీకరణ కింద భూములు ఇచ్చిన వారికి వారి వారి హక్కులు యధావిధిగా ఉంటాయి. అయితే, డెవలప్ చేసిన ప్లాట్ల విషయంలో మార్పులు ఉండొచ్చు.సీఆర్డీఏ చట్టం రద్దయిన 15 రోజుల్లోగా VGMTUDA ఆధ్వర్యంలో మరో కొత్త మాస్టర్ ప్లాన్ వస్తుంది. అవసరమైతే అందులో రాజధాని పరిధి పెంచొచ్చు. తగ్గించవచ్చు.

అమరావతి బాండ్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. గతంలో ఆ బాండ్లను కొనుగోలు చేసిన వారు గడువు తీరకముందే ఆ బాండ్లను పరస్పర అంగీకారంతో సెటిల్ చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

లాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం సంవత్సరానికి చెల్లించే మొత్తం అదనంగా మరో మూడేళ్లపాటు పొడిగిస్తుంది.లాండ్ పూలింగ్‌లోని చాప్టర్ 9 కింద భూములు ఇచ్చిన వారికి అభివృద్ధి చేసిన భూమిలో ఎకరానికి 200 గజాలు అదనంగా భూమి ఇస్తుంది. అది కూడా సీఆర్డీఏ పరిధిలోనే ఇస్తుంది.
First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు