వల్లభనేని వంశీపై పోటీ చేసి ఓడిన వైసీపీ నేతకు జగన్ గిఫ్ట్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల సహకార బ్యాంకులకు చైర్మన్లను నియమించింది.

news18-telugu
Updated: December 4, 2019, 7:57 PM IST
వల్లభనేని వంశీపై పోటీ చేసి ఓడిన వైసీపీ నేతకు జగన్ గిఫ్ట్...
జగన్, వంశీ, వెంకట్రావు(ఫైల్ ఫోటోలు)
 • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల సహకార బ్యాంకులకు చైర్మన్లను నియమించింది. 13 సహకార బ్యాంకులకు చైర్మన్‌లు, పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేత వల్లభనేని వంశీ మీద పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుకు కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పదవి లభించింది. ఇటీవల వల్లభనేన వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో వెంకట్రావు సీఎం జగన్‌ను కలిశారు. వంశీ రాకను ఆయన వ్యతిరేకించారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావును బుజ్జగించేందుకు జగన్ ఈ పదవి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు విజయకుమార్ రెడ్డికి నెల్లూరు జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి లభించింది.


 1. కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ గా యార్లగడ్డ వెంకట్రావు

 2. శ్రీకాకుళం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా పాలవలస విక్రాంత్

 3. విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా మరిసర్ల తులసి

 4. విశాఖ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా యూ. సుకుమార్ వర్మ

 5. పశ్చిమగోదావరి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కావూరి శ్రీనివాస్
 6. నెల్లూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా ఆనం విజయ్ కుమార్ రెడ్డి

 7. చిత్తూర్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా ఎం.రెడ్డమ్మ

 8. కర్నూల్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా మాధవరం రామి రెడ్డి

 9. వైస్ఆర్ కడప జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా తిరుప్పల్ రెడ్డి

 10. అనంతపురం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా బోయ వీరాంజనేయులు

 11. ప్రకాశం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా డాక్టర్ మాదాసి వెంకయ్య

 12. తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా అనంత ఉదయ భాస్కర్

 13. గుంటూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా రత్తంశెట్టి సీతారామాంజనేయులు

Published by: Ashok Kumar Bonepalli
First published: December 4, 2019, 7:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading