HOME »NEWS »POLITICS »ys jagan who comes to hyderabad for the first time as a ap cm sb

సీఎం హోదాలో తొలిసారిగా... ఇవాళ హైదరాబాద్‌కు రానున్న జగన్

సీఎం హోదాలో తొలిసారిగా... ఇవాళ హైదరాబాద్‌కు రానున్న జగన్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Source: Twitter)

సీఎం హోదాలో జగన్ తొలిసారిగా... శనివారం హైదరాబాద్ వస్తున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ఇస్తున్న ఇఫ్తార్ విందులో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొంటున్నారు.

  • Share this:
    ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మొదటిసారిగా హైదరాబాద్ లో అడుగుపెడుతున్నారు. నిన్నమొన్నటివరకు వైసీపీ అధినేతగా.. ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్...హైదరాబాద్‌లోనే చాలావరకు పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. లోటస్ పాండ్‌లో ఉంటూ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కదిద్దారు. అయితే ఎన్నికల ఫలితాలకు కొద్దిరోజుల ముందే... తాడేపల్లిలో ఆయన కొత్తగా నిర్మించుకున్న ఇంటిలోకి షిప్ట్ అయ్యారు జగన్. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో విజయం సాధించడం... సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అన్ని మనకు తెలిసిన విషయాలు. అయితే సీఎం హోదాలో జగన్ తొలిసారిగా... శనివారం హైదరాబాద్ వస్తున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ఇస్తున్న ఇఫ్తార్ విందులో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొంటున్నారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది. ఇఫ్తార్ విందు కోసం రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 3న గుంటూరులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలోనూ జగన్ కూడా పాల్గొంటారు.

    అయితే, గవర్నర్ ఇఫ్తార్ విందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నాయకులు, వివిధ పార్టీలకు కూడా ఆహ్వానాలు అందుతాయి. ఈ ప్రకారం ఏపీలో ప్రతిపక్షం నుంచి చంద్రబాబుకు కూడా గవర్నర్ ఇఫ్తార్ విందుకు ఆహ్వానం అందుతుంది. ఎన్నికల్లో జగన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత చంద్రబాబునాయుడు.. గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు హాజరవుతారా? లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. జగన్ మోహన్ రెడ్డి తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఫోన్ చేసి పిలిచారు. అయితే, ప్రమాణస్వీకారానికి హాజరుకాని చంద్రబాబు ఓ లేఖ ద్వారా అభినందనలు తెలిపారు.

    First published:June 01, 2019, 07:02 IST

    टॉप स्टोरीज