సొంత ఇలాఖాలో నేడే జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

ఉదయం 8.10గం.లకు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన నేరుగా ఇడుపులపాయకు వెళ్తారు. అక్కడ వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.

news18-telugu
Updated: July 8, 2019, 6:49 AM IST
సొంత ఇలాఖాలో నేడే జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
కలెక్టర్ల సదస్సులో సీఎం వైఎస్ జగన్ (File Photo)
news18-telugu
Updated: July 8, 2019, 6:49 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇడుపులపాయలో ఏర్పాటు చేసే జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. సీఎం హోదాలో జగన్ సొంత జిల్లాలో పర్యటించబోతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.ఉదయం 8.10గం.లకు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన నేరుగా ఇడుపులపాయకు వెళ్తారు. అక్కడ వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా పలు అభివృద్ది పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా పులివెందులలో వైఎస్సార్ హార్టీకల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా అరటి పరిశోధన కేంద్రానికి 10.30గం.కు శంకుస్థాపన చేయనున్నారు.

అక్కడి నుంచి బయలుదేరి 11.15గం.కు జమ్మలమడుగులో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభ కోసం ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి.సభకు దాదాపు 20వేల మంది జనాన్ని సమీకరించనున్నారు. సభా వేదికపై 75మంది ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ వేదిక నుంచి జగన్ రైతులకు ఒక భరోసా ఇవ్వనున్నారు.పెన్షన్లు,రైతులకు సంబంధించిన పలు పథకాలపై ఆయన ప్రకటనలు చేసే అవకాశముంది. వైఎస్సార్ జన్మదినాన్ని రైతు దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. రైతులపై ఆయన
కొత్తగా వరాల జల్లు ఏమైనా కురిపిస్తారా? అన్న ఆసక్తి నెలకొంది.

First published: July 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...