స్కూళ్లు తెరవడానికి లేని కరోనా, ఎన్నికలకు అడ్డొచ్చిందా?: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరవడానికి కరోనా అడ్డు రాలేదని, స్థానిక ఎన్నికల నిర్వహణకు కరోనా అడ్డం వచ్చిందా అని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

news18-telugu
Updated: November 4, 2020, 10:12 PM IST
స్కూళ్లు తెరవడానికి లేని కరోనా, ఎన్నికలకు అడ్డొచ్చిందా?: చంద్రబాబు
చంద్రబాబు నాయుడు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరవడానికి కరోనా అడ్డు రాలేదని, స్థానిక ఎన్నికల నిర్వహణకు కరోనా అడ్డం వచ్చిందా అని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘స్థానిక ఎన్నికల నిర్వహణకు కరోనా ఉందన్నారు. పిల్లల బడులు తెరవడానికి కరోనా లేదా?. విద్యార్ధుల జీవితాలతో ఆడుకోడానికి కరోనా లేదా?. ఎన్నికల నిర్వహణకు కరోనా ఉందా?. ఈ విధంగా కరోనాను కూడా తమ స్వార్ధానికి వాడుకున్న చరిత్ర వైసీపీది.’ అని చంద్రబాబు అన్నారు. అనకాపల్లి పార్లమెంటుపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ‘విపత్తుల్లో వైసీపీ పత్తా లేకుండా పారిపోతోంది. అటు కరోనాలో, ఇటు వరుస వరద విపత్తులు, భారీ వర్షాలలో వైసిపి పనితీరును ప్రజలే గ్రహించారు. హుద్ హుద్ లో, తిత్లిలో టీడీపీ ఆదుకున్న తీరు, ఇప్పుడు వైసీపీ నిర్లక్ష్యంపై ప్రజలే చర్చిస్తున్నారు. కరోనా నియంత్రణలో వైసీపీ ఘోరంగా విఫలం అయ్యింది. కరోనా బాధితులను ఆదుకోవడంపై తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులు, కులవృత్తుల వారిని ఆదుకునే చర్యలు లేవు. భారీ వర్షాలు, వరదల్లో పంటలు నష్టపోయిన రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ గాని, పరిహారం గాని ఇవ్వలేదు.’ అని చంద్రబాబు విమర్శించారు.

విశాఖలో వైసీపీ ఆగడాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేత మండిపడ్డారు. ‘వైసీపీ విశాఖను ఫాక్షనిస్టుల అడ్డాగా మార్చేస్తోంది. బెదిరింపులతో, ఫాక్షనిస్టుల దందాలతో, రౌడీ రాజకీయంతో విశాఖను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని అతలాకుతలం చేశారు. భూకబ్జాలు, బెదిరింపులు, రౌడీ దందాలతో భయభ్రాంతులు చేస్తున్నారు. మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో ప్రజలే చూస్తున్నారు. ఎక్కడ చూసినా అవినీతి కుంభకోణాలే.. అక్రమార్జనలో మునిగి తేలుతున్నారు. విశాఖ వాసులు అభివృద్దిని, ఉపాధిని కోరుకుంటారే తప్ప, హింస, విధ్వంసాలను సహించరు. తమ ప్రశాంత జీవనాన్ని దెబ్బతీసే చర్యలను హర్షించరు. చట్ట ఉల్లంఘనలను అంగీకరించరు.

వైసీపీ వచ్చాక పరిశ్రమల్లో వాటాల కోసం పారిశ్రామిక వేత్తలను బెదిరించి తరిమేశారు. కొత్త పెట్టుబడులు రాకుండా చేశారు. యువత ఉపాధి అవకాశాలను దారుణంగా దెబ్బతీశారు.’ అని చంద్రబాబు మండిపడ్డారు.

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని చంద్రబాబు మండిపడ్డారు. ‘టీడీపీ హయాంలో రాష్ట్రం కళకళలాడింది. 13జిల్లాలలో అభివృద్ది పనులతో నిత్యం కోలాహలంగా ఉండేది. భారీ మెషీనరీ, వేలాది కూలీలతో సందడిగా ఉండేది. పేదలకు ఇళ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు, అనేక పరిశ్రమలు, యువతకు ఉపాధి. ఈ రోజు ఎక్కడ చూసినా అభివృద్ది పనులన్నీ నిలిచిపోయి, అంతా వెలవెల పోయే పరిస్థితి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ప్రజలపై వేల కోట్ల భారాలు మోపారు. మోసం చేయడంలో జగన్ ను మించిన వాళ్లు లేరు. మాయమాటలు చెప్పడం, అపోహలు సృష్టించడంలో నిష్ణాతుడు. వీటన్నింటిని ప్రజలకు వివరించి చెప్పాలి. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. వైసీపీ బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలని’ అని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

విశాఖను ఐటీ రాజధానిగా చేయాలని టీడీపీ ఆరాటపడిందని, రూ 145కోట్లతో మిలీనియం ట్విన్ టవర్స్ నిర్మించామన్నారు. టీడీపీ హయంలో అభివృద్ది చేసిన మెడ్ టెక్ జోన్ ఇప్పుడు కరోనా కిట్ల తయారీలో ఎంతో ఉపయోగ పడిందన్నారు. వైసీపీ వచ్చాక ఒక్క సమ్మిట్ అయినా విశాఖలో జరిగిందా? అంతర్జాతీయ స్థాయి సదస్సు ఒక్కటి నిర్వహించారా? వైసీపీ వచ్చాక ఒక్క పరిశ్రమ అయినా విశాఖకు వచ్చిందా? విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏమైంది? దాని గురించి ఏమైనా కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారా? విశాఖ నుంచి లులూను తరిమేశారు. ఫ్రాంక్టిన్ టెంపుల్ టన్ ను వెళ్లగొట్టారు. అంతా నాశనం చేశారు. ఏపీకి చెడ్డపేరు తెచ్చారు.’ అని చంద్రబాబు మండిపడ్డారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 4, 2020, 10:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading